టార్గెట్‌..మధురాన్నం

ABN , First Publish Date - 2022-09-15T05:16:10+05:30 IST

గోదావరి చైతన్య సొసైటీ ఆధ్వర్యంలో జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మధురాన్నం పేరిట మధ్యాహ్న భోజనం సరఫరా చేస్తున్నారు. ఇప్పుడు ఓ మంత్రి మధురాన్నాన్ని లక్ష్యంగా చేసు కోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

టార్గెట్‌..మధురాన్నం
తాడేపల్లిగూడెం జడ్పీ పాఠశాలలో మధురాన్నం తింటున్న విద్యార్థినులు

నాణ్యత లేదంటూ ఓ మంత్రిగారి  ప్రకటనలు
లేఖలు ఇవ్వాలంటూ హెచ్‌ఎంలకు ఆదేశాలు
ఇవ్వలేమంటూ తేల్చేస్తున్న ఉపాధ్యాయులు
డీడీఆర్‌సీ సమావేశంలోనూ ప్రస్తావన
అధికార పార్టీలో లుకలుకలు.. సీఎం దృష్టికి సమస్య


గోదావరి చైతన్య సొసైటీ ఆధ్వర్యంలో జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మధురాన్నం పేరిట మధ్యాహ్న భోజనం సరఫరా చేస్తున్నారు.  ఇప్పుడు ఓ మంత్రి మధురాన్నాన్ని లక్ష్యంగా చేసు కోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దీని వెనుక ఆంతర్యమేమిటనేది అంతుచిక్కడం లేదు. అధికార పార్టీ నేతల మధ్య విభేదాలు ఇందుకు కారణమా? లేదా వేరే కారణాలున్నాయా అనే చర్చ ఇప్పుడు అధికార పార్టీలో నడుస్తోంది.

 (భీమవరం–ఆంధ్రజ్యోతి)

జిల్లాలో 100 పాఠశాలల్లో మధురాన్నం అమలు జరుగుతోంది. గోదావరి చైతన్య సొసైటీకి జిల్లా రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ ప్రోత్సాహం ఉంది. మాజీ మంత్రి, ఎమ్మెల్యే రంగరాజు నేతృత్వంలో  మధురాన్నం పేరుతో మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు సరఫరా చేస్తున్నారు. దీనిపై ఇప్పుడు ఓ మంత్రి కన్ను పడింది. గతంలో జరిగిన డీడీఆర్‌సీ సమా వేశంలో మధురాన్నం నాణ్యత లోపించిందంటూ ఆ మంత్రి  ప్రశ్నించగా రంగరాజు ఖండించారు. అక్కడితో మధురాన్నం ప్రస్తావన సమసి పోలే దు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న గడపగడపకు మన ప్రభుత్వం కార్య క్రమంలోనూ సదరు మంత్రి మధురాన్నం పేరుతో అమలు జరుగుతున్న మధ్యాహ్న భోజన పంపిణీపై విమర్శనాస్ర్తాలు సంధిస్తూ వస్తున్నారు. తాడేపల్లిగూడెంలోని ఓ ప్రధాన పాఠశాల ప్రధానోపాధ్యాయుడిపై ఒత్తిడి తెచ్చి మధురాన్నం బాగోలేదంటూ లిఖిత పూర్వకంగా ఇవ్వాలని ఆదేశిం చారు. విద్యార్థులు బాగుంటోందని చెబుతున్నారంటూ సదరు హెచ్‌ం స్పష్టం చేయడంతో మంత్రి అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో మధురాన్నం ఒక అంశంగా మంత్రి జోడించడం అధికార పార్టీలోనూ చర్చనీయాంశమైంది. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న రంగరాజు నేతృత్వంలో నడస్తున్న మధురాన్నంపై   ఆ మంత్రి లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేయడం వెనుక ఆంతర్యమేమి టంటూ వైసీపీ నాయకులు, కార్యకర్తల్లో చర్చకు దారితీసింది. ఇది సీఎం జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి వెళ్లినట్టు తెలుస్తోంది. ఉద్దేశపూర్వకంగానే మంత్రి లక్ష్యంగా పెట్టుకున్నారన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఒక దశలో విద్యార్థులు వద్దనుకుంటే మధురాన్నం విరమించుకోవాలన్న నిర్ణయానికి నిర్వాహ కులొచ్చేశారు. అయితే ఉపాధ్యాయులు, విద్యార్థులు దీనిపై ఆసకి ్త చూపారు. కొత్తగా మరికొన్ని పాఠశాలలు ముందుకొచ్చాయి. మరోవైపు మంత్రి సూచన లకు అనుగుణంగా  ఏ ఒక్క పాఠశాల నుంచి లేఖలు వెళ్లలేదు.  
 తెలుగుదేశం హయాంలోనే జిల్లాలో మధురాన్నం ప్రారంభించారు. అప్పట్లో తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాలకే వర్తింపజేశారు. పాఠశాలల అనుమతితోనే గోదావరి చైతన్య సొసైటీ దీనిని అమలు చేసింది. తొలుత సొంత మెనూతో  భోజనం పంపిణీ చేశారు. తదుపరి రోజుల్లో ప్రభుత్వ మెనూ ప్రకారమే పెట్టాలన్న ఆదేశాలు వచ్చాయి. వాస్తవానికి ప్రభుత్వమే మధ్యాహ్న భోజనాన్ని మహిళలకు బదులుగా  ఫౌండేషన్‌లకు అప్పగిం చాలని భావించింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాను ఐదు డివిజన్‌ లుగా విభజించింది. ఏక్‌తా ఫౌండేషన్‌కు బాధ్యతలను అప్పగించింది. గోదావరి చైతన్య సమితి పంపిణీ చేసే పాఠశాలలను మినహాయించి మిగిలిన పాఠశాలల్లో ఆ ఫౌండేషన్‌ మధ్యాహ్న భోజనం సరఫరాకు శ్రీకా రం చుట్టింది. ఆపై ఆ సంస్థ వైదొలగడంతొ ఎప్పటిలాగే మహిళలే ఆ బాధ్యతను నిర్వహిస్తున్నారు. జిల్లాలో ఒక్క గోదావరి చైతన్య  సొసైటీ మాత్రమే 100 పాఠశాలలకు భోజనం సరఫరా చేస్తోంది. దాదాపు 10 వేల మంది విద్యార్థులకు భోజనం అందిస్తున్నారు. ప్రభుత్వ స్థాయిలో ప్రోత్సాహం ఉంటోంది. టీడీపీ హయాంలోనూ అవరోధాలు ఎదురు కాలేదు. రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భారతీయ విద్యా భవన్స్‌ సంస్థల్లోనే భీమవరం, తాడేపల్లిగూడెంలో మధురాన్నం తయారు చేసి. సొంత వాహనాల ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు చేరుస్తు న్నారు. ఒక విధంగా మధ్యాహ్న భోజనం సరఫరా సంస్థలకు ఇవ్వాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతోంది.

సొంతపార్టీలోనే చర్చ
  ఓ మంత్రి మధురాన్నాన్ని లక్ష్యంగా చేసుకోవడం సర్వత్రా చర్చ నీయాంశంగా మారింది. దీనివెనుక ఆంతర్యమేమిటనేది అంతు చిక్కడం లేదు. అధికార పార్టీ నేతల మధ్య విభేధాలు ఇందుకు కారణమా? లేదా వేరే కారణాలున్నాయా అనే చర్చ ఇప్పుడు అధికార పార్టీలోనే నడుస్తోంది. పంచా యతీ కాస్త ముఖ్యమంత్రి వద్దకు వెళ్లడంతో ప్రస్తుతం కొనసాగుతున్న విధానం లోనే మధురాన్నం సరఫరా చేయాలన్న సంకేతాలు ప్రభుత్వం వచ్చినట్టు సమాచారం. మొత్తంగా మధురాన్నం అధికార పార్టీలో నేతల మధ్య భేధాభిప్రాయాలను తెరపైకి తెచ్చింది.

Updated Date - 2022-09-15T05:16:10+05:30 IST