Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

సర్వేలతో కాలయాపన

twitter-iconwatsapp-iconfb-icon
సర్వేలతో కాలయాపన

ఏటిగట్ల పరిశీలనకు మళ్లీ కమిటీ రాక

నరసాపురం, ఆగస్టు 19:
ఏటా గోదావరికి వచ్చే వరద లకు అపార నష్టం తప్పడం లేదు. 1986 వరదలను పరిగణ లోకి తీసుకుని ఏటిగట్లను ఎత్తు పెంచినా ముంపు తప్పడం లేదు. దీని నివారణకు గతేడాది ప్రభుత్వం ఐదుగురు నిపుణులతో కూడిన కమిటీని నియమించింది. ఈ కమిటీ పలు సిఫార్సులను చేసింది. అయితే వీటిలో గతేడాది ఒక్కటి కూడా చేపట్టలేదు. దీంతో ఈ ఏడాది జూలై, ఈ నెలలో వచ్చిన వరదలకు నష్టం తప్పలేదు. మళ్లీ అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఈ ఏడాది ఏప్రిల్‌లో నియమిం చింది. అందులో ప్రస్తుతం ఇరిగేషన్‌ శాఖ చీఫ్‌ ఇంజనీర్‌తోపాటు మరో నలుగురిని సభ్యులుగా నియమించింది. ప్రస్తుతం వరద తగ్గగానే ఈ కమిటీ జిల్లాలోని గోదావరి పరీవాహక ప్రాంతాల్లో పర్యటిం చనుంది. ఇప్పటికే ఏటిగట్ల శాఖ అధికారులకు సమా చారం రావడంతో ఏటిగట్టుల పరిస్థితిని ఏరియల్‌ సర్వేతో సిద్ధం చేశారు. దీంతో పాటు కమిటీ ఎక్కడెక్కడ పర్యటించాలన్న దానిపై టూర్‌మ్యాప్‌ సిద్ధం చేస్తున్నారు. గతేడాది పర్యటనలో జిల్లాలో దొడ్డిపట్ల, బురుగుపల్లి, యలమంచిలి, రాజుల్లంక, బియ్యపుతిప్ప, అబ్బిరాజుపాలెం వద్ద పెండింగ్‌లో ఉన్న ఏటిగట్టు పనులను పూర్తి చేయాలని సూచించింది. శిఽథిలావస్థకు చేరిన స్లూయిజ్‌ల మర మ్మతులు, కొత్త స్లూయిజ్‌ల నిర్మాణం చేపట్టాలన్న దానిపై సమగ్ర నివేదిక ఇచ్చింది. కోతకు గురవుతున్న ప్రదేశాల్లో గ్రోయిన్స్‌ నిర్మించాలని పేర్కొంది. అందులో నరసాపురం వద్ద రెండుచోట్ల గ్రోయిన్స్‌ నిర్మాణం చేపట్టాలని సూచించింది. అయితే ఇవేమీ కార్య రూపం దాల్చలేదు. ఈసారి పర్యటనలో కమిటీ చేసే సిఫార్సు లైనా ప్రభుత్వం అమలు చేస్తుందా? అన్నది సందేహంగా మారిం ది. ఇప్పటికే నరసాపురం పొన్నపల్లి వద్ద ఏటి గట్టు కోతకు గురికాగా రూ.17 కోట్లుతో ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించారు. ఇదికాకుండా పట్టణంలోని మాధవా యిపాలెం రేవు నుంచి కొండాలమ్మ గుడి వరకు ఏటిగట్టుపై నిర్మించిన ఫుట్‌పాత్‌ కూడా ఓ పక్కకు ఒరుగుతోంది. భవిష్యత్‌లో ఇది కూడా నదిలోకి కూలే ప్రమాదం ఉంది. దీని నివారణకు అడుగుభాగంలో ఫిల్లర్‌ నిర్మాణంతోపాటు కోతకు గురవుతున్న ప్రదేశంలో రాళ్లు ఏర్పాటు  చేపట్టాల్సి ఉంది. ఈస్ట్‌ కుక్కులేరు, దర్భరేవు స్లూయిజ్‌ నిర్మాణాలు యుద్ధ ప్రతిపాదన చేపట్టాల్సి ఉంది. వీటిన్నంటిని ఐదుగురు సభ్యుల కమిటీ దృష్టికి తీసుకెళ్లేందుకు వీడియోలతోపాటు ఫొటోలను సిద్ధం చేశారు. ప్రస్తుతం వరద ఉధృతి ఇంకా తగ్గలేదు. ఈ కారణంగా సెప్టెంబర్‌లో కమిటీ పర్యటించే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.