అప్పుల భారం భరించలేక రోడ్డుపై పురుగు మందు తాగేశాడు..

ABN , First Publish Date - 2021-01-27T05:37:43+05:30 IST

ఒక వ్యక్తి రోడ్డుపైనే కొట్టుమిట్టాడుతుంటే టూ టౌన్‌ సీఐ బోణం ఆది ప్రసాద్‌ తన వాహనంలో వేసుకుని ఏలూరు ప్రభుత్వా సుపత్రికి తీసుకువెళ్ళారు.

అప్పుల భారం భరించలేక రోడ్డుపై పురుగు మందు తాగేశాడు..
బాధితుడిని ఆస్పత్రికి తరలిస్తున్న పోలీసులు

 బాధితుడిని భుజానికెత్తుకున్న సీఐ ఆది ప్రసాద్‌

తన వాహనంలో ఆస్పత్రికి చేర్చిన వైనం

ఏలూరు క్రైం, జనవరి 26 : ఒక వ్యక్తి రోడ్డుపైనే కొట్టుమిట్టాడుతుంటే టూ టౌన్‌ సీఐ బోణం ఆది ప్రసాద్‌ తన వాహనంలో వేసుకుని ఏలూరు ప్రభుత్వా సుపత్రికి తీసుకువెళ్ళారు. ఏలూరు వన్‌టౌన్‌ ప్రాంతా నికి చెందిన పాలతుర్రు నాగ మునేశ్వరరావు (38)ఇంటి వద్దే జంతికలను తయారు చేసి షాపులకు వేస్తూ ఉంటాడు. కరోనా లాక్‌డౌన్‌తో కుటుంబ పోషణ నిమిత్తం అనేక మంది దగ్గర అప్పులు చేశాడు. అప్పులు తీర్చే మార్గం కానరాలేదు. దీంతో 25వ తేదీ ఉదయం ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. ఫోన్‌ స్విచ్‌ ఆపివేశాడు. కుటుంబ సభ్యులు ఏలూరు వన్‌ టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మునేశ్వరరావు మంగళవారం మధ్యాహ్నం ఏలూరు ఆర్‌ అండ్‌ బి కార్యాలయం సమీపంలో రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌ వద్ద పురుగు మందు తాగి అక్కడే కొట్టుమిట్టాడుతున్నాడు. అనేక మంది వచ్చి అతన్ని చూస్తూ ఉన్నారు. మరోవైపు 108 అంబులెన్స్‌ కాల్‌ సెంటర్‌కు కాల్‌ చేశారు. అటు నుంచి స్పందన లేదు. అటుగా వెళ్తున్న టూటౌన్‌ సీఐ బోణం ఆది ప్రసాద్‌ వెంటనే బాధితుడు మునేశ్వరరావును తన భుజానికి ఎత్తుకుని కారు సీట్లో పడుకోబెట్టి ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చారు. ఈ సంఘటనపై ఆసుపత్రి వైద్యులు ఎమ్మెల్సీగా నమోదు చేశారు.


Updated Date - 2021-01-27T05:37:43+05:30 IST