క్రీడాకారులకు ఒలింపిక్‌ స్థాయి శిక్షణే లక్ష్యం

ABN , First Publish Date - 2022-01-21T05:18:56+05:30 IST

ఒలింపిక్‌ స్థాయి క్రీడాకారులను తయారు చేయడమే లక్ష్యంగా క్రీడా పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ అన్నారు.

క్రీడాకారులకు ఒలింపిక్‌ స్థాయి శిక్షణే లక్ష్యం
మార్చ్‌ఫాస్ట్‌ చేస్తున్న పోలసానిపల్లి స్కౌట్‌ విద్యార్థినులు


 మంత్రి విశ్వరూప్‌ : క్రీడా పాఠశాలలు ప్రారంభం


పెదవేగి, జనవరి 20 : ఒలింపిక్‌ స్థాయి క్రీడాకారులను తయారు చేయడమే లక్ష్యంగా క్రీడా పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ అన్నారు. పెదవేగిలోని ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో బాలురకు, పోలసానిపల్లి గురుకుల విద్యాలయంలో బాలికలకు ఏర్పాటు చేసిన క్రీడా పాఠశాలలను పెదవేగి గురుకుల విద్యాల యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గురువారం సాయంత్రం మంత్రి ప్రారం భించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురుకుల విద్యాలయాలను అన్నివిధాలా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. గురుకుల విద్యాలయాల్లో రూ.54 కోట్లతో క్రీడల అభివృద్ధికి వ్యయం చేయనున్న ట్టు చెప్పారు. తొలుత గురుకుల విద్యార్థులు నిర్వహించిన మార్చ్‌ఫాస్ట్‌ ఆకట్టు కుంది. పెదవేగి సొసైటీకి అనుబంధంగా రూ.40 లక్షల అంచనాతో నిర్మించను న్న 500 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం కలిగిన గొడౌన్‌, మల్టీపర్సస్‌ ఫెసిలిటేషన్‌ సెంటర్‌ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. దెందులూరు, ఉంగుటూరు, చింతలపూడి ఎమ్మెల్యేలు కొఠారు అబ్బయ్య చౌదరి, పుప్పాల వాసుబాబు, ఎలీజా, గురుకుల విద్యాలయ సమితి కార్యదర్శి హర్షవర్థన్‌, శాప్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రభాకరరెడ్డి, జేసీ పద్మావతి, స్పోర్ట్స్‌ కో ఆర్డినే టర్‌ కె.జయరాజు, జడ్పీ వైస్‌ చైర్మన్‌ పి.విజయబాబు, పెదవేగి ఎంపీపీ రమ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-21T05:18:56+05:30 IST