కర్ఫ్యూ సమయంలో బయటకు రావద్దు : ఎస్పీ

ABN , First Publish Date - 2021-05-06T05:05:58+05:30 IST

మధ్యాహ్నం 12 గంటల తరువాత కర్ఫ్యూ సమయంలో ఎవరైనా రోడ్డుపైన తిరిగితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ నారాయణ నాయక్‌ హెచ్చరించారు

కర్ఫ్యూ సమయంలో బయటకు రావద్దు : ఎస్పీ
ఏలూరు ఆశ్రమం ఆసుపత్రి వద్ద పరిఽశీలిస్తున్న ఎస్పీ నాయక్‌

ఏలూరు క్రైం, మే 5 : మధ్యాహ్నం 12 గంటల తరువాత కర్ఫ్యూ సమయంలో ఎవరైనా రోడ్డుపైన తిరిగితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ నారాయణ నాయక్‌ హెచ్చరించారు. బుధవారం మధ్యాహ్నం ఏలూరులో పలు ప్రాంతాల్లో ఎస్పీ ఆకస్మికంగా పరిశీలించారు. కర్ఫ్యూ సమ యంలో ఎవరైనా అనవసరంగా బయటకు వస్తే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఏలూరు సమీపంలోని ఆశ్రం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కొవిడ్‌ కేంద్రాన్ని కూడా ఎస్పీ పరిశీలించారు. అక్కడ వైద్యం పొందుతున్న వారికి కావాల్సిన సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా లేదా అని ఆశ్రం ఆసుపత్రి వైద్య బృందాన్ని అడిగారు.  ఏలూరు డీఎస్పీ దిలీప్‌ కిరణ్‌ , సిబ్బంది పాల్గొన్నారు. 


Updated Date - 2021-05-06T05:05:58+05:30 IST