అటు చూడొద్దు!

ABN , First Publish Date - 2022-05-22T05:30:00+05:30 IST

తాడేపల్లిగూడెం మండలం జగ్గన్నపేట మాలపాడు చెరు వును మూడు రోజులుగా అక్రమార్కులు తవ్వేస్తున్నారు.

అటు చూడొద్దు!
జగ్గన్నపేట మాలపాడు చెరువులో మట్టి తవ్వకాలు

మట్టి దందాలో నిబంధనలకు నీళ్లు
మట్టి తవ్వకానికి పంచాయతీ తీర్మానం
గ్రామంలో రోడ్డేస్తామంటూ ఆమోదం
జగ్గన్నపేటలో తవ్వకాలు ప్రారంభం..  గ్రామంలో గుప్పెడు మట్టి వేస్తే ఒట్టు
తాడేపల్లిగూడెం తరలిస్తున్న మాఫియా
అటువైపు చూడరాదంటూ అధికారులకు ఓ నేత ఒత్తిళ్లు
అక్రమ తవ్వకాలు లేకుండా చూడాలంటూ మరోవైపు జిల్లా అధికారుల  ఆదేశాలు
నలిగిపోతున్న మండల అధికారులు


 రాష్ట్రస్థాయి నేత చెప్పారు.. పంచాయతీ తీర్మానం చేసింది.. గ్రామంలో బీటీ రహదారికి పంచాయతీ చెరువు తవ్వ కానికి ఆమోదం తెలిపింది. మైనింగ్‌ శాఖ అనుమతులు లేకుండానే తవ్వకాలు ప్రా రంభించారు. ఇంతకీ గ్రామంలో మట్టి పోయడం లేదు. పంచాయతీ నుంచి పట్టణానికి తరలిస్తున్నారు. అక్రమ రవా ణాను అడ్డుకోవాల్సిన  మండల స్థాయి లో రెవెన్యూ అధికారులు ఎవ్వరూ అటు వైపు కన్నెత్తి చూడకూడదంటూ ఆ నేత నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో యథేచ్ఛగా మట్టి దందా సాగుతోంది.


 (భీమవరం–ఆంధ్రజ్యోతి)
తాడేపల్లిగూడెం మండలం జగ్గన్నపేట మాలపాడు చెరు వును మూడు రోజులుగా అక్రమార్కులు తవ్వేస్తున్నారు. రాష్ట్ర స్థాయి నేత పేరుచెప్పి అధికారులు, స్థానిక సిబ్బందిని కట్టడి చేశారు. రాష్ట్ర స్థాయినేత సైతం రెవెన్యూ, పంచా యతీ సిబ్బందికి హెచ్చరికలు జారీ చేశారు. మట్టి తవ్వ కానికి అడ్డు రాకూడదంటూ దిశానిర్దేశం చేశారు. అంతే రాత్రీపగలు తవ్వకాలు సాగిపోతున్నాయి. ఈ చెరువులో కంకర మట్టి ఉండడంతో డిమాండ్‌ ఉంది. పంచాయతీ తీర్మానం మేరకు మట్టిని గ్రామంలో రహదారి వేయడానికి ఉపయోగించాలి. అలా కాకుండా పట్టణంలో అవసరాలు తీర్చేందుకు తరలించి నిల్వ చేస్తున్నారు. తాడేపల్లిగూడెంలో సిమెంట్‌ రహదారులు వేసే క్రమంలో ముందుగా కంకరతో మట్టి వేసేందుకు వినియోగిస్తామని రవాణాదారులు చెబు కొస్తున్నారు. మునిసిపాలిటీలో సిమెంట్‌ లేదా కంకర రహదా రులు వేయాలన్నా.. ఆర్‌అండ్‌బీ రహదారులు వేయాలన్నా కంకర కొనుగోలుకు సరిపడా అంచనాలు రూపొందిస్తారు. ప్రస్తుతం మునిసిపాలిటీ పరిధిలో తాళ్ల ముదునూరుపాడు నుంచి పెంటపాడు వరకు ప్రధాని రహదారిని సిమెంట్‌ రహదారిగా అభివృద్ధి చేయనున్నారు. దానికి కూడా కంకర అవసరం కానుంది. మొత్తానికి అక్రమార్కులు ముందు చూపుతో కంకరమట్టిని పోగు చేస్తున్నారు. జగన్నపేట పం చాయతీ తీర్మానం పేరుతో మాలపాడు చెరువులో కంకర మట్టిని తరలిస్తున్నారు.
జూ రాష్ట్ర నేత చెప్పిందే తడవుగా పంచాయతీ తీర్మానం చేసింది. జగ్గన్నపేట పంచాయతీ పరిధిలో సూర్పణ సరసయ్య నివాసం నుంచి బంగారు గూడెం బీటీ రోడ్డు వరకు ఉన్న మట్టి రహదారిని అభివృద్ధి చేసేందుకు మాలపాడు చెరువును తవ్వేందుకు పంచాయతీ అమోదించింది. కానీ ఇప్పటివరకు గుప్పెడు మట్టిని కూడా అక్కడ వేయలేదు. చెరువులో తవ్వుతున్న కంకరను ముందుచూపుతో తాడేపల్లిగూడెం తరలిస్తున్నారు. వాస్తవానికి గ్రామ పంచాయతీ తీర్మానాన్ని మైనింగ్‌ శాఖకు పంపాలి. మైనింగ్‌ అనుమతులు పొందాలి. అలా జరగలేదు. కేవలం పంచాయతీ తీర్మానం పేరుతో అక్రమంగా కంకర మట్టిని తరలిస్తుండడం గమనార్హం.

ఒత్తిళ్లలో అధికారులు
 మండలంలో మట్టి మాఫియా ఆగడాలతో అధి కారులు ఒత్తిళ్లకు లోనవుతున్నారు. రాష్ట్ర నేత నుం చి ఆదేశాలు ఉండడంతో అధికారులు ఏమీ చేయలేకపోతు న్నారు. తీర్మానానికి భిన్నంగా మట్టిని తరలించినట్టయితే అడ్డుకోవాల్సిన అధికారులు నిస్సహాయంగా చూస్తున్నారు. పంచాయతీ చెరువు తవ్వకాన్ని, రవాణాకు అడ్డుతగల కూడదంటూ నేత నుంచి ఆదేశాలు వెళ్లాయి. అంతే స్థానిక సిబ్బంది నుంచి మండల అధికారుల వరకు అంతా సైలెంట్‌ అయిపోయారు. మరోవైపు తవ్వకాల విషయం బయటకు తెలిస్తే జిల్లా అధికారుల నుంచి చీవాట్లు పడాల్సి వస్తుందన్న ఆందోళనలో ఉన్నారు. ఇటువంటి ఒత్తిళ్లతోనే తాడేపల్లిగూడెం నుంచి అధికారులు బదిలీపై వెళ్లిపోతున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తాడేపల్లిగూడెం తహసీల్దార్‌లుగా పనిచేస్తున్న ఇద్దరు అధికారులు బదిలీ చేసుకుని వెళ్లిపోయారు. పెంటపాడు తహసీల్దార్‌గా పనిచేసిన మహిళా అధికారిని స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. ఇప్పటికీ అధికారులు ఒత్తిళ్లతో సతమతమవుతున్నారు. ఇదివరకే అక్రమ మైనింగ్‌పై జిల్లా అధికారులు వివరణ కోరారు. ఆరుగొలను క్వారీల నుంచి అక్రమ రవాణాను నిరోధించారు. దాంతో మండలంలోని మరో ప్రాంతంపై మాఫియా కన్నేసింది. అందులో భాగంగానే జగన్నపేట చెరువులో తవ్వకాలు సాగిస్తోంది. ఇదే ఇప్పుడు మండల అధికారులను కలవరపాటుకు గురిచేస్తోంది. అడ్డుకుంటే రాజకీయ నేతను ఆగ్రహానికి గురికావాల్సి వస్తోంది. లేదంటే జిల్లా అధికారులకు సంజాయిషీ ఇవ్వాలి. దాంతో ఎటూ పాలుపోని పరిస్థితిలో అధికారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

Updated Date - 2022-05-22T05:30:00+05:30 IST