Abn logo
Apr 13 2021 @ 00:04AM

వలంటీర్లకు సేవా పురస్కారాలు

ఏలూరు కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 12: వలంటీర్లు ప్రజా సేవకులని వారి సేవలు నిరుపమానమని ఉప ముఖ్య మంత్రి ఆళ్ళ నాని అన్నారు. ఏలూరు ఇండోర్‌ స్టేడియంలో గ్రామ, వార్డు వలంటీర్ల సేవలకు గుర్తింపుగా ఉగాది పండుగ పురస్కరించుకుని ప్రభుత్వం వారికి సత్కారం, అవార్డుల ప్రదానోత్సవం చేపట్టింది. మంత్రులకు తానేటి వనిత, నాని వలంటీర్లకు సేవా పురస్కారాలను అందజేశారు. నాని మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 2.70 లక్షల మంది వలంటీర్లు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తున్నారన్నారు. సేవామిత్ర, సేవారత్న, సేవావజ్ర పురస్కారాలను వలంటీర్లకు ప్రదానం చేశారు. మంత్రి వనిత మాట్లా డుతూ వలంటీర్లు వారధి లాంటి వారని కొవిడ్‌ సమయంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా సేవలం దించారని కొనియాడారు. జాయింట్‌ కలెక్టర్లు హిమాన్షు శుక్లా, నంబూరి తేజ్‌భరత్‌, జడ్పీ సీఈవో శ్రీని వాసులు, ఇన్‌ఛార్జి ఆర్డీవో పద్మావతి, వ్యవసాయశాఖ జేడీ గౌసియా బేగం, డీఈవో రేణుక పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement