రెగ్యులర్‌ పాట్లు

ABN , First Publish Date - 2021-10-18T05:01:29+05:30 IST

రెగ్యులర్‌ అవుతు న్నాం.. జీతాలు పెరుగుతాయి.. ఆర్థిక కష్టాల్లో నుంచి బయటపడ తాం.. భవిష్యత్‌కు ఢోకా ఉండదు’ అని రెండు, మూడు నెలలుగా ఆశగా ఎదురుచూ స్తున్న సచివాలయ ఉద్యోగులను ప్రభుత్వ తీరు నిరాశకు గురి చేస్తోంది.

రెగ్యులర్‌ పాట్లు

  సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ పూర్తి 

 పరిశీలన పేరుతో తాత్సారం

ఏలూరు, అక్టోబరు 17 (ఆం ధ్రజ్యోతి):‘ రెగ్యులర్‌ అవుతు న్నాం.. జీతాలు పెరుగుతాయి.. ఆర్థిక కష్టాల్లో నుంచి బయటపడ తాం.. భవిష్యత్‌కు ఢోకా ఉండదు’ అని రెండు, మూడు నెలలుగా ఆశగా ఎదురుచూ స్తున్న సచివాలయ ఉద్యోగులను ప్రభుత్వ తీరు నిరాశకు గురి చేస్తోంది. అదిగో ఇదిగో అంటూనే రెండేళ్లు పూర్తయింది. కానీ వారు ఇప్పటికీ రెగ్యులర్‌ ఉద్యోగులుగా మారలేదు. రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను ప్రారంభించి రెండేళ్లయ్యింది. 2019 అక్టోబరు రెండో తేదీ గాంధీ జయంతి రోజున జిల్లాలోని 938 వార్డు, గ్రామ సచివాలయాల్లో 11 విభాగాలకు చెందిన మొత్తం పది వేల 26 మంది ఉద్యోగుల ను నియమించారు. నియామక ప్రక్రియ అక్టోబరు నుంచి డిసెంబరు వరకూ జరిగినందున తొలి దశలో ఎంపికైన వేలాది మందికి రెండేళ్ల ప్రొబేషన్‌ కాలం పూర్తయ్యింది. మిగిలిన వారికీ రెండు, మూడు నెలల్లో పూర్తవుతుంది. 


పరీక్షలు.. పరిశీలనల పేరిట తాత్సారం

సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ నిర్ణయించడానికి  శాఖాప ర మైన పరీక్షలను ప్రామాణికంగా ప్రభుత్వం నిర్ణయించింది. వీటిల్లో 90 శాతం మందికిపైగా అభ్యర్థులు రెండు పేపర్లు ఉత్తీర్ణులయ్యారు. వీరి ప్రొబేషన్‌ ఖరారు బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్‌కు అప్పగించినప్పటికీ దీనికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల కాకపోవడంతో వారు అడుగు ముందుకు వేయలేకపోతున్నారు. అభ్యర్థులు చేరిన తేదీ, రిజర్వేషన్‌, ప్రొబేషన్‌ కాలానికి సంబంధించిన వివరాలను సేకరించడంతోనే కలెక్టర్లకు సరిపోతోంది. మరోవైపు గత నెల 23న మ హిళా పోలీసులకు జరిగిన టెస్టు ఫలితాలు ఇప్పటికీ విడుదల కాలేదు. దీంతో వారు ఆందోళన చెందుతున్నారు. కంప్యూటర్‌ ప్రొఫి షియన్సీ టెస్ట్‌ (సీపీటీ) ఈనెల 28న నిర్వహిస్తున్నారు. ప్రొబేషన్‌ ఖరారు కావడానికి ముందే జరగాల్సిన ఈ టెస్టు ఇప్పటి వరకూ జరగక పోవడంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. ఈటెస్టు ఫలితాలు తమ జీవితాలను తలకిందులు చేస్తాయన్న భయం వారిని వెంటాడుతోంది.



Updated Date - 2021-10-18T05:01:29+05:30 IST