Advertisement
Advertisement
Abn logo
Advertisement

పార్లమెంటు ఆమోదంతో ..సాగు చట్టాలు రద్దు చేయాలి

రైతు సంఘాల సమన్వయ కమిటీ డిమాండ్‌..  రైతు సత్యాగ్రహ దీక్ష

ఏలూరు టూటౌన్‌, నవంబరు 26 : పార్లమెంటు ఆమోదంతో కేంద్ర సాగు చట్టాలను రద్దు చేయాలని రైతు సంఘాల సమన్వయ కమిటీ డిమాండ్‌ చేసిం ది. శుక్రవారం నల్లచట్టాలను రద్దు చేయాలని వసంతమహల్‌ సెంటర్‌లో రైతు లు సత్యాగ్రహదీక్ష నిర్వహించారు. పలువురు రైతు నాయకులు మాట్లాడుతూ ఢిల్లీలో రైతాంగ ఉద్యమం సంవత్సరం పూర్తయిన సందర్భంగా సంయుక్త కిసా న్‌ మోర్చ ఇచ్చిన పిలుపులో భాగంగా సత్యాగ్రహ దీక్ష నిర్వహిస్తున్నా మన్నారు. మద్దతు ధరల గ్యారెంటీ చట్టాన్ని తేవాలని, కేంద్ర విద్యుత్‌ సవరణ బిల్లును రద్దు చేయాలన్నారు. రైతుల నుంచి ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నా రు. విశాఖ ఉక్కు ప్రైవేటీ కరణను ఆపాలని, కార్మిక వ్యతిరేక లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలన్నారు. రైతాంగ ఉద్యమంలో పాల్గొన్న రైతులపై బనాయించిన అక్రమ కేసులను ఎత్తివేయాలన్నారు. రైతు ఉద్యమంలో అమరులైన కుటుంబా లకు నష్టపరిహారం చెల్లించాలన్నారు. కాంగ్రెస్‌ కిసాన్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు జెట్టి గురునాథరావు, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్‌, సీపీఎం జిల్లా కార్యదర్శి సి.హెచ్‌.బాబూరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్‌, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ జిల్లా అధికార ప్రతినిధి యు.వెంకటే శ్వరరావు, ఏఐటీయూసీ నాయకుడు సుబ్బారావు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బి.సోమ య్య, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాజనాల రామ్మోహన్‌రావు, బీకేఎంయూ జిల్లా కార్య దర్శి వెంకటేశ్వరరావు, ఏఐకేఎంఎస్‌ జిల్లా కార్యదర్శి ప్రకాష్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement