బియ్యం బాదుడు!

ABN , First Publish Date - 2022-09-10T06:34:57+05:30 IST

జిల్లా వాసులు సన్న రకాలనే అధికంగా వినియోగి స్తుంటారు.

బియ్యం బాదుడు!

బడా వ్యాపారుల సిండికేట్‌
ప్యాకెట్‌ గరిష్ఠంగా రూ.1400
నెల రోజుల్లోనే రూ.300 పెంపు
ధాన్యం కొరత, జీఎస్టీ అంటూ మెలిక
జిల్లాలో సన్నరకాల వినియోగమే అధికం.. వినియోగదారులపై భారం


సన్న బియ్యం మిల్లర్లు సిండికేట్‌ అయ్యారు. ధరలు అనూహ్యంగా పెంచే శారు. నెల రోజుల వ్యవధిలోనే ప్యాకెట్‌ బియ్యంపై రూ.300 ధర పెరిగింది.   ధాన్యం కొరత, జీఎస్టీ అమలు వంటి కారణాలతో వినియోగదారులపై  భారం మోపుతున్నారు. బియ్యం వర్తకులు తాము జీఎస్టీ మినహాయింపు పొందేలా కొత్త మార్గాలు అన్వేషించినా వినియోగదారుడిని మాత్రం ధరలు పెంచి నిలువునా దోచేస్తున్నారు.

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

జిల్లా వాసులు సన్న రకాలనే అధికంగా వినియోగి స్తుంటారు. జిల్లావ్యాప్తంగా 80 శాతం  సన్న రకాలే అమ్ముడుపోతుంటాయి. మధుమేహం, అధిక బరువు వంటి సమస్యలు ఉండే వారు మాత్రమే పీఎల్‌, స్వర్ణ రకాలను వినియోగిస్తున్నారు. రైతు వద్ద పాత ధాన్యం లభ్యత లేదన్న పేరుతో మిల్లర్లు బియ్యం ధర లు పెంచేస్తున్నారు. ప్రస్తుతం పాత ధరలతో కొద్దో గొప్పో నిల్వలున్నాయి. 26 కిలోల బియ్యం ప్యాకెట్‌ పాత ధర రూ.1,250లుగా ఉండేది. ఇప్పటి వరకు ఉన్న నిల్వలు అయిపోతే కొత్త ధరలతో మార్కెట్‌లోకి బియ్యం రానున్నాయి. జిల్లాలో అధికంగా వినియో గించే మూడు రకాల సన్న బియ్యం ధరలు గూబ గుయ్‌ మనిపిస్తున్నాయి. సన్న రకాల వర్తకులు పూర్వ తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 40 మంది రైస్‌ మిల్లర్ల చేతి లోనే బియ్యం మా ర్కెట్‌ ఊగిసలాడుతోంది. జిల్లా లో మిల్లర్లు అంతా ప్రభుత్వం కొనుగోలు చేసే ధాన్యంపై ఆధా రపడుతున్నారు. కస్లమ్‌ మిల్లిం గ్‌ చేసి ప్రభుత్వానికి బియ్యం అప్పగిస్తున్నారు. సన్న రకాలు ఇతర జిల్లాల నుంచే దిగుమతి అవుతున్నాయి. ప్రస్తుతం తూ ర్పుగోదావరి, గుంటూరు నుంచి దిగుమతి అయ్యే రెండు రకాల సన్న బియ్యం 26 కిలోల ప్యాకెట్‌ రూ.1400లకు పెం చేశారు. కొత్తగా జిల్లాకు దిగుమతి చేసే బియ్యమంతా ఇదే ధరతో విక్రయించనున్నారు. వాస్తవానికి రెండు నెలల క్రితం వీటి ధర రూ.1100 మాత్రమే ఉండేది. గతంలో రూ. 950 ధర పలికిన సన్న బియ్యం ఇప్పుడు రూ.1300లకు చేరింది. సన్న బియ్యం ధరలు పెంచేయడంతో  స్వర్ణ, పీఎల్‌ రకాలను పెంచేశారు.

మిల్లర్ల వద్దే ధాన్యం నిల్వలు
మిల్లర్ల వద్ద ధాన్యం నిల్వలున్నాయి. రైతుల నుంచి తక్కువ ధరకే ధాన్యం కొనుగోలు చేశారు. మిల్లులకు చేరిపోయిన తర్వాత ధాన్యానికి డిమాండ్‌ పెరి గిం దంటూ వర్తకులు కొత్త పాట వినిపిస్తున్నారు. ప్రస్తు తం ధాన్యం ధర పెరిగినా  రైతు వద్ద నిల్వలు లేవు. మిల్లర్లే తమ వద్ద నిల్వ ఉన్న ధాన్యం ధరలు పెంచే శారు. ఆ మేరకు బియ్యం ధరలు పెరిగిపోయా యం టూ చెబుతున్నారు.  

చిరు వ్యాపారులే టార్గెట్‌
ధరలు పెరిగినప్పుడల్లా అధికారులు చిరు వ్యాపా రులనే లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. పౌర సరఫరాల శాఖ అధికారులు, రెవెన్యూ యంత్రాంగ మంతా రిటైల్‌ వర్తకుల పైనే దృష్టి పెడుతోంది. షాపుల్లో ధరల పట్టిక పెట్టాలంటూ దిశానిర్దేశం చేస్తున్నారు.  బడా వ్యాపారుల జోలికి పోవడం లేదు.  సన్న రకాల ధాన్యం కొనుగోళ్లు, బియ్యం నిల్వలపై తనిఖీలు ఉం డడం లేదు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసిన త ర్వాత తనిఖీలు మందగించాయి. గతంలో బియ్యం ధరలు ఒకేసారి ఇంతలా పెరిగిన దాఖలాలు లేవు.

 కలసిరాని జీఎస్టీ
రాష్ట్ర ప్రభుత్వం గతంలో బియ్యంపై వ్యాట్‌పన్ను అమలు చేసేది. భారత ఆహార సంస్థ ప్రభుత్వానికి 5శాతం వ్యాట్‌ పన్ను చెల్లించేది. వ్యాపారులు సైతం పన్ను కట్టేవారు. అప్పట్లో కాస్తయినా లెక్క ఉండేది. కేంద్ర ప్రభుత్వం  జీఎస్టీ అమలులోకి తెచ్చిన తర్వాత బియ్యం మార్కెట్‌పై పర్యవేక్షణ కొరవడింది. బ్రాండెడ్‌ రకాలపైనే కేంద్రం తొలుత 5శాతం జీఎస్టీని అమలు చేసింది. బ్రాండెడ్‌ రిజిస్ర్టేషన్‌లపై బడా వ్యాపారులు బియ్యం విక్రయాలు నిలిపివేశారు. వాటి స్థానంలో శ్రీ వంటి పదాలను చేర్చి విక్రయాలు నిర్వహిస్తూ వచ్చా రు. ఇలా జీఎస్టీ నుంచి సన్న రకాల బియ్యాన్ని వ్యాపారులు తప్పించగలిగారు. ఎప్పుడైతే జీఎస్టీ  అమలు కాలేదో అధికారులు అటువైపు కన్నెత్తి చూడ లేదు. బియ్యంపై ఎలాగైనా పన్ను రాబట్టాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం స్టిక్కర్‌లు ఉండే బియ్యం పాకెట్‌లకు జీఎస్టీ  అమలు చేసింది. దానిపై పరి మితి విధించింది. మార్కెట్‌లో 25 కిలోలు ప్యాకెట్‌లు విక్రయిస్తున్నారు. దాంతో  25 కిలోలలోపు ఉండే వాటికి జీఎస్టీ  అమలు చేసింది. తీరా వ్యాపారులు ఇప్పుడు 26 కిలోలు మార్కెట్‌లోకి విడుదల చేస్తు న్నారు. ఇలా జీఎస్టీ నుంచి మినహాయింపు పొందు తున్నారు. అదే జీఎస్టీ  అమలులోకి వచ్చిం దన్న కార ణంతోనూ బియ్యం ధరలను పెంచేశారు. మరోవైపు ధాన్యం కొరత నెపం పెడుతున్నారు. మొత్తంపైన రైతుల నుంచి తక్కువ ధరలకు ధాన్యం కొనుగోలు చేసి నిల్వ ఉంచుకున్నారు. ఇప్పుడు పెద్ద ఎత్తున ఽబియ్యం ధరలను పెంచేశారు. దీనిపై ప్రభుత్వ పర్యవేక్షణ లేకుండా పోతోంది. వినియోగదారులపై భారం పడుతోంది.

Updated Date - 2022-09-10T06:34:57+05:30 IST