రైతులకు దక్కని భరోసా

ABN , First Publish Date - 2021-04-21T05:41:26+05:30 IST

రైతు భరోసా కేంద్రం.. రైతులకు అన్నిరకాల సేవలందించేందుకు ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేసింది.

రైతులకు దక్కని భరోసా

ఆర్బీకేల పనితీరుపై రైతుల పెదవి విరుపు

అన్నదాతలకు మొక్కుబడి అవగాహన

ఇంటర్నెట్‌ లేక ఆన్‌లైన్‌  సేవల్లేవు

పలు భవనాలకు అద్దెలు పెండింగ్‌

అనేకచోట్ల నేటికీ తెరుచుకోని కేంద్రాలు


– భీమవరం :

రైతు భరోసా కేంద్రం.. రైతులకు అన్నిరకాల సేవలందించేందుకు ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాల్లో మట్టి, ఎరువులు, పండిన పంట పరీక్షల దగ్గర నుంచి వ్యవసాయ, ఉద్యాన, మత్స్య శాఖల నిపుణుల వరకు రైతులకు అందు బాటులో ఉండి వారి సందేహాలను, సమస్యలకు ఎప్పటికప్పుడు పరిష్కారం చూపిస్తారు. పంటల కొనుగోళ్లు, పురుగు మందులు, ఎరువుల విక్రయాలు ఇక్కడే జరుగుతాయన్నారు. జిల్లాలో గ్రామాల్లో 948 పట్టణాల్లో 17 ప్రారంభించిన తొలి నాళ్లలో అన్ని శాఖల అధికారులు అక్కడ కనిపించేవారు. ఆన్‌లైన్‌ టెక్నాలజీ సేవలందేవి. అవగాహన తరగతులు జరిగేవి. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. 


రైతు భరోసా కేంద్రాలను పరిశీలిస్తే..


రైతుల విజ్ఞానానికి ఎల్‌ఈడీ టీవీలను ఏర్పాటు చేశారు. వీడియోలతో అవగాహన కల్పించే కార్యక్ర మాలు లేకపోవడంతో ఇవి మూలనపడ్డాయి. 

వ్యవసాయ పథకాలు, వినియోగం తెలియజేసే ఆన్‌లైన్‌ కియోస్క్‌ కార్యక్రమం నిలిచిపోయింది. ఇం దుకవసరమైన ఇంటర్‌నెట్‌ బిల్లు చెల్లించడం లేదు. వీరవాసరం ఆర్‌బీకేను తీసుకుంటే గత ఏడాది జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌ నెలలో ఇంటర్‌నెట్‌ బిల్లు రూ.2,365 చెల్లించలేదని నెట్‌ కనెక్షన్‌ తొలగించారు. ఈ నెల 10న మరోసారి బకాయిలు చెల్లించాలని బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆర్‌బీకేలకు నోటీసులు జారీచేసింది. 

ఆన్‌లైన్‌ ద్వారా రికార్డు చేయాల్సిన అనేక కార్యక్ర మాలు నిలిచిపోయాయి. గత నెలలో ఆయా మం డలాల ద్వారా పచ్చిరొట్ట విత్తనాల కోసం ఆన్‌లైన్‌ చేయకపోవడంతో పిల్లిపెసర విత్తనాలు అందలేదు. 

జిల్లాలోని 230 కేంద్రాలు అద్దె భవనాల్లో నడుస్తు న్నాయి. వీటికి పలుచోట్ల అద్దె పెండింగ్‌లో ఉంది. వాటికి విద్యుత్‌ బిల్లు చెల్లించడం లేదు. బిల్లు మం జూరుకు ఆరు నెలలకుపైగా పడుతుందని చెబుతు న్నారు. అందుకే కొన్నిచోట్ల విద్యుత్‌ కనెక్షన్‌ తీసేశా రని సమాచారం. 

నిపుణులను నియమించి రైతులను అవగాహన పెంచాలి. కాని వ్యవసాయంలో అంతంతమాత్రం గానే పరిజ్ఞానం వున్న ప్రైవేటు వలంటీర్లను నియ మించారు. వారి పర్యవేక్షణలోనే రాష్ట్రవ్యాప్తంగా 46 వేల ఎకరాలలో ఏపీ స్టేట్‌ కమ్యూనిటీ మేనేజ్‌మెం ట్‌ నేచ్యురల్‌ ఫార్మింగ్‌ సంస్థ ద్వారా ప్రకృతి వ్యవ సాయం చేయించారు.అది తీవ్ర నష్టంగా మారింది. రైతులతోపాటు ప్రభుత్వ ఖజానాకు వేల కోట్లు ఆర్ధిక భారంగా తయారైంది. 

వలంటీర్లు రైతుల దగ్గరకు సరిగా వెళ్లకపోవడంతో చర్చా గోష్టులకు సైతం హాజరు కాలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నెల 9, 10, 11 తేదీలలో విజయ వాడలో నిర్వహించిన వ్యవసాయ సదస్సుకు రాష్ట్ర వ్యాప్తంగా 200 మంది కూడా హాజరుకాలేదు. 

రైతు భరోసా హబ్‌ల ద్వారా నీరు, మట్టి పరీక్షలు చేసిన దాఖలాలు కనిపించడం లేదు. ఇది మొక్కు బడిగా సాగుతోంది. భీమవరం వ్యవసాయ మార్కెట్‌ కమిటీలోని రైతు భరోసా హబ్‌ ద్వారా ఇటువంటి సేవలు అంతంతమాత్రంగానే ఉన్నాయి.

ఆర్‌బీకేల కోసం ప్రభుత్వం 2020 జూలై నుంచి డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ రైతు భరోసా మాసపత్రికను ప్రారంభించారు. సాగులో రైతులు పాటించాల్సిన మెలకువలను పత్రిక ద్వారా రైతులకు అందిస్తారు. కాని చాలాచోట్ల పత్రిక అందడం లేదు. రావడం లేదని అడిగే వారే లేరు. 

ఆర్‌బీకేలలోనే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాని ఈ ప్రక్రియ మళ్లీ సొసైటీల ద్వారానే సాగుతోంది. 

 చెప్పినంత కనిపించడం లేదు

రైతు భరోసా కేంద్రాల గురించి ప్ర భుత్వం చెప్పినంత సేవలు కనిపిం చడం లేదు. సిబ్బంది కూడా రైతుల కు పెద్దగా చెప్పిన విషయాలు లేవు. 

బి సూరిబాబు, రైతు, భీమవరం

రైతులకు ఈ కేంద్రాల వలన ఉపయోగం ఏమిటో నాకు తెలియ దు. అంతగా ఉపయోగించే పను లు దీనివల్ల కనిపించడం లేదు. 

గనిశెట్టి మధుబాబు, కాళ్ళ


Updated Date - 2021-04-21T05:41:26+05:30 IST