Abn logo
Feb 28 2021 @ 23:53PM

నేటి నుంచి రేషన్‌

మార్చి నెల కోటా పట్టణ ప్రాంతాలకే పరిమితం

గ్రామాల్లో కొనసాగుతున్న ఫిబ్రవరి నెల కోటా

ఇంటి దగ్గర లేనివారికి ప్రతిరోజు

సచివాలయాల వద్ద పంపిణీ

ఏలూరుసిటీ, ఫిబ్రవరి 28: జిల్లాలోని ఏలూరు నగరంతో పాటు అన్ని మునిసిపాలిటీలలో మార్చి నెల కోటా నిత్యావసర సరుకులు సోమవారం నుంచి ఇంటిం టికీ పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని 9 మునిసిపాలిటీలలో రేషన్‌ కార్డుదారులకు 126 మొబైల్‌ వాహనాల ద్వారా రేషన్‌ సరుకులు పంపిణీ చేస్తారు. ఇంటికి వాహనం వచ్చినప్పుడు ఎవరైనా ఇంటి దగ్గర లేనట్లయితే, అటువంటి వారికి ప్రతి రోజు సాయంత్రం 6  నుంచి 7 గంటల వరకు సంబంఽధిత వార్డు సచివాలయం వద్ద మొబైల్‌ వాహనం ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తారని పౌర సరఫరా అధికారులు తెలిపారు. 

గ్రామీణ ప్రాంతాల్లో ఫిబ్రవరి కోటా

గ్రామీణ ప్రాంతాల్లో ఫిబ్రవరి నెల రేషన్‌ పంపిణీ పూర్తికాలేదు. ఇది పూర్తయిన తర్వాతే మార్చి నెల కోటా రేషన్‌ అందిస్తారు. ప్రస్తుతం ఫిబ్రవరి నెల కోటా రేషన్‌ పంపిణీ పూర్తి చేయడానికి ఇంటింటికీ పంపిణీకి బదు లుగా రేషన్‌ డిపోల వద్దే రేషన్‌ సరుకులు కార్డుదారు లకు అందజేస్తున్నారు. అయినా పంపిణీ పూర్తి కాలేదు.  దీంతో వీఆర్వో లాగిన్‌తో రేషన్‌ డిపోలవద్దే సరుకులను రేషన్‌ కార్డుదారులకు అందిస్తున్నారు.  


Advertisement
Advertisement
Advertisement