Abn logo
Jun 14 2021 @ 23:47PM

పీఈటీ మెరిట్‌లో అరుణ రెడ్డికి ఫస్ట్‌ ర్యాంకు

తాడేపల్లిగూడెం రూరల్‌, జూన్‌ 14: డీఎస్సీ– 2018 పీఈటి మెరిట్‌ జాబితాలో తాడేపల్లిగూడె ంకు చెందిన సత్తి అరుణ రెడ్డికి జిల్లా ఫస్ట్‌ ర్యాంకు లభించింది. 2018 సంవత్సరంలో డీఎస్సీ రాసి రిజల్ట్‌ కోసం వేచి చూస్తున్న వారిలో తాడే పల్లిగూడెం యువతి ఘనత సాధించింది. తాడేపల్లిగూడెం కొబ్బరితోటకు చెందిన అరుణ తండ్రి సత్తి భాస్కరరెడ్డి బస్సు డ్రైవర్‌గా పనిచేస్తుంటారు.  మొదటి నుంచి ప్రభుత్వ విద్యాలయాల్లో చదివిన ఆమె పాఠశాల స్థాయిలో తనను ప్రొత్స హించి ఈ దిశగా పయనించేలా చేసిన గురువు పీఈటి చిట్టిబాబు ప్రొత్సా హంతోనే సాధించానని తెలిపారు. రాబోయే రోజుల్లో పేద విద్యార్థులను క్రీడల దిశగా మంచి శిక్షణ ఇచ్చి వారిని అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా చేయడమే తన లక్ష్యమని అరుణ తెలిపారు.