పీఎఫ్‌..ఉఫ్‌!

ABN , First Publish Date - 2022-08-12T05:36:42+05:30 IST

కుముదవల్లిలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసిన ఒక మాస్టారు పీఎఫ్‌ ఖాతాలో రూ.36 లక్షలు ఉంది.

పీఎఫ్‌..ఉఫ్‌!

ఏళ్లు గడుస్తున్నా జమ కాని సొమ్ములు
జిల్లాలో వందల మంది బాధితులు
ప్రభుత్వమే వినియోగించుకుందంటూ గగ్గోలు
సరెండర్‌ లీవ్‌లకు సొమ్ములు చెల్లించని ప్రభుత్వం
 నష్టపోతున్నామంటూ ఉద్యోగుల ఆవేదన


(భీమవరం–ఆంధ్రజ్యోతి)

కుముదవల్లిలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసిన ఒక మాస్టారు పీఎఫ్‌ ఖాతాలో రూ.36 లక్షలు ఉంది. ఆ సొమ్ము వాడకుండా ఉం చుకుని ఒకేసారి తీసుకోవచ్చని భావించారు. ఉద్యోగ విరమణ అనంతరం 2019లో పీఎఫ్‌ సొమ్ము కోసం దరఖాస్తు చేసుకున్నారు. మూడేళ్లు కావొస్తున్నా ఇప్పటివరకు ప్రభుత్వం పీఎఫ్‌ సొమ్ములు చెల్లించలేదు. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి సమాధానం లేదు.  
తాడేపల్లిగూడెంలోని ఓ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న సైన్స్‌ ఉపాధ్యా యునికి పీఎఫ్‌ ఖాతాలో రూ.20 లక్షలు ఉన్నాయి. అందులో రూ.13 లక్షలు తీసుకోవాలని గతేడాది డిసెంబరులో దరఖాస్తు చేసుకున్నారు. నెలలు గడిచి పోతున్నాయి. ఇప్పటివరకు ఆయన బ్యాంకు ఖాతాలో సొమ్ములు పడ లేదు. సాంకేతిక ఇబ్బందులంటూ అధికారులు చెపుతున్నారు.
కలెక్టరేట్‌ పరిధిలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి తన సెలవు దినాలను ప్రభుత్వా నికి సరెండర్‌ చేశారు. గత మూడేళ్ల నుంచి వినియోగించని 30  సెలవు దినాలపై ఒకేసారి దరఖాస్తు చేసుకున్నారు. సెలవులు వినియోగించుకో కుండా విధులు నిర్వహించి ప్రభుత్వానికి వాటిని సరెండర్‌ చేస్తే సొమ్ములు ఇవ్వాలి. ఇప్పటివరకు సరెండర్‌ లీవ్‌లపై ప్రభుత్వం ఒక్క రూపాయి విడుదల చేయడం లేదు.
– ఇలా చెప్పుకుంటే పోతే జిల్లాలో వందల మంది ఉద్యోగులు ప్రభుత్వ బాధితులుగా ఉన్నారు. పీఎఫ్‌ ఖాతా ల్లో ఉన్నది ఉద్యోగుల సొంత సొమ్ము. ఇంటి నిర్మాణం, పిల్లల చదువులు, పెళ్లిళ్లు, ఆస్పత్రి ఖర్చులు ఇలా వివిధ అవసరాలకు పీఎఫ్‌ సొమ్మును వినియోగించుకుంటారు. అర్హతను బట్టి  పీఎఫ్‌ సొమ్ము ఇస్తారు.  జిల్లాలో ఉపాధ్యాయులతో పాటు, ప్రభుత్వ ఉద్యోగులు  పీఎఫ్‌ సొమ్ము కోసం దరఖాస్తు చేసుకు న్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పీఎఫ్‌ సొమ్ములను ఇవ్వడం లేదు. ట్రెజరీల్లో అవరోధం లేకుండా ఆమోదం తెలుపుతున్నారు. పీఎఫ్‌ కార్యాలయాల్లోనూ దరఖాస్తులకు ఆమోదముద్ర పడుతోంది. కానీ సొమ్ములు లేవంటూ తాత్సారం చేస్తున్నారు.  దీంతో ప్రభుత్వమే తమ పీఎఫ్‌ సొమ్ము వినియోగించుకుందంటూ ఉద్యోగులు గగ్గోలు పెడుతున్నారు. అందువల్లే పీఎఫ్‌ సొమ్ములు  ఖాతాల్లో జమ కావడం లేదని  ఆరోపిస్తున్నారు. గతంలో గరిష్ఠంగా నెల వ్యవధిలోనే పీఎఫ్‌ సొమ్ము ఖాతాలో జమ అయేది. ఇటీవల మరింత వేగవంతమైంది. ఆమో దం పొందిన వారం రోజుల వ్యవధిలోనే ఉద్యోగి ఖాతాలో పీఎఫ్‌ సొమ్ము వచ్చి పడుతోంది. అటువంటిది వైసీపీ ప్రభుత్వ హయాంలో నెలలు కాదు. ఏళ్ల తరబడి ప్రభుత్వ ఉద్యోగులు వేచి చూడాల్సి వస్తోంది.
ఉద్యోగుల పీఎఫ్‌ సొమ్ములు చెల్లించని ప్రభుత్వం సాంకేతిక ఇబ్బందులు తలెత్తడం వల్లే సొ మ్ములు పడడం లేదంటూ చెప్పుకొస్తోంది. ఇంతకీ ఉద్యోగుల ఖాతాల్లో సొమ్ములు ఏమయ్యాయనే దానిపై ప్రభుత్వం పెదవి విప్పడం లేదు.  
సరెండర్‌ లీవ్‌ల విషయంలోనూ ప్రతి ప్రభుత్వ ఉద్యోగి బాధితుడిగా మా రారు. కొద్దిమంది తప్పా ఉద్యోగులంతా సెలవు దినాలు మిగిలిఉంటే ప్రభు త్వానికి సరెండర్‌ చేస్తుంటారు. అందుకు సంబంధించి ప్రభుత్వం ఉద్యో గులకు సొమ్ములు చెల్లిస్తుంది. ఇప్పుడు వాటిని కూడా ప్రభుత్వం పరి గణలోకి తీసుకోవడం లేదు. సెలవు దినాలను ప్రభుత్వానికి సరెండర్‌ చేసిన వారంతా ఇప్పుడు సొమ్ముల కోసం ఎదురు చూస్తున్నారు.

Updated Date - 2022-08-12T05:36:42+05:30 IST