Advertisement
Advertisement
Abn logo
Advertisement

అమర వీరుల త్యాగాలను స్మరించుకోవాలి

అమర వీరుల సంస్మరణ స్థూపం వద్ద శ్రద్ధాంజలి ఘటిస్తున్న మంత్రి నాని, మేయర్‌, డీఐజీ,ఎస్పీలు

సంస్మరణ దినోత్సవ సభలో మంత్రి నాని

ఏలూరు క్రైం, అక్టోబరు 21 : పోలీసు అమర వీరులను స్మరించుకుంటూ వారి త్యాగానికి సానుభూతి, గౌరవం చూపడం మనందరి బాధ్యత అని రాష్ట్ర  వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని అన్నారు. పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకుని పోలీసు పెరేడ్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన అమర వీరుల సంస్మరణ స్థూపం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. అమర వీరులకు నివాళులర్పించారు. విధి నిర్వహణలో నూతన ఉత్తేజాన్ని, స్పూర్తిని నింపడమే పోలీసు అమరవీరుల సంస్మరణ దినం ప్రధాన ఉద్దేశమన్నారు. ఏలూరు రేంజ్‌ డీఐజీ మోహనరావు మాట్లాడుతూ ఎటువంటి సవాళ్లకు అయినా సిద్ధ్దంగా ఉంటూ అత్యుత్తమ సేవలందిస్తున్న పోలీస్‌ సిబ్బంది, అధి కారులు అభినందనీయులని అన్నారు. ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ పోలీసు లేని సమాజాన్ని ఊహించుకోలేమని ఏ ఆపద వచ్చినా ఆశ్రయించేది పోలీసులనే నన్నారు. మేయర్‌ నూర్జహాన్‌, మార్కెట్‌ యార్డు చైౖర్మన్‌ మంచెం మైబాబు, రెడ్‌క్రాస్‌ సొసైటీ మాజీ చైౖర్మన్‌ మామిళ్ళపల్లి జయప్రకాష్‌ (జెపి), వైసీపీ నాయకులు ఎస్‌ఎంఆర్‌ పెదబాబు, ఎంఆర్‌డీ బలరామ్‌, బండారు కిరణ్‌కుమార్‌, ఎస్‌ఈబీ అదనపు ఎస్పీ జయరామరాజు, ఏలూరు డీఎస్పీ డాక్టర్‌  దిలీప్‌ కిరణ్‌, డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement