త్వరితగతిన పనులు పూర్తి చేయాలి : కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-07-01T06:16:05+05:30 IST

ప్రధాని రాకకు సంబంధించి ఆయా శాఖల అధికారులకు కేటాయించిన విధుల పట్ల పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని, వాటిని బాధ్యతగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి సూచించారు.

త్వరితగతిన పనులు పూర్తి చేయాలి : కలెక్టర్‌
పెదఅమిరంలోని సభాస్థలిని పరిశీలిస్తున్న కలెక్టర్‌ ప్రశాంతి, మాజీ మంత్రి శ్రీరంగనాథరాజు

భీమవరం, జూన్‌ 30 : ప్రధాని రాకకు సంబంధించి ఆయా శాఖల అధికారులకు కేటాయించిన విధుల పట్ల పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని, వాటిని బాధ్యతగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి సూచించారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లుపై ఏఎస్‌ఆర్‌ సాంస్కృతిక కేంద్రంలో గురువారం నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు 125వ జయంతి పురస్కరించుకుని జూలై 4న భారత ప్రధాన మంత్రి భీమవరం రానున్న సందర్భంగా శాఖలపరంగా చేపట్టిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. విధి నిర్వహణలో ఎటువంటి జాప్యం జరగకుండా పూర్తి అవగాహనతో పనిచేయాలని అధికారులకు సూచించారు. ప్రధాన మంత్రి సభా వేదిక వద్ద విధులు నిర్వహించే అధికారులకు వాటికి కేటాయించిన విధులపై ముందుగానే పూర్తి అవగాహన ఉండా లన్నారు. రహదారులన్ని శానిటేషన్‌ చేయాలని, సభా ప్రాంగణంకు వచ్చిన ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సూచించారు.  జేసీ జేవీ మురళి, కేంద్ర కల్చర్‌ డైరెక్టర్‌ దీపక్‌ మిశ్రాని, నరసాపురం సబ్‌ కలెక్టర్‌ సి.విష్ణు చరణ్‌, డీఆర్వో కె.కృష్ణవేణి, ఆర్డీవో దాసిరాజు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ప్రధాని సభ ఏర్పాట్ల పరిశీన
కాళ్ళ, జూన్‌ 30 : పెదఅమిరంలో జూలై 4న జరిగే ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సభ ఏర్పాట్లను గురువారం కలెక్టరు పి.ప్రశాంతి, మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు పరిశీలించారు. సభ నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు తలెత్త కుం డా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్‌ సిబ్బందిని ఆదేశించారు.  

Updated Date - 2022-07-01T06:16:05+05:30 IST