Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఇళ్ల డబ్బులు ఇప్పుడు కట్టాలా?

పోడూరు ఎంపీడీవో కార్యాలయం వద్ద ధర్నా

పోడూరు, నవంబరు, 26 : గతంలో నిర్మించిన గృహాలకు ప్రస్తుతం జగనన్న గృహ హక్కు పథకం కింద రూ.10 వేలు చెల్లించాలని అధికారులు డిమాండ్‌ చేస్తున్నారని, ఈ రుణాల నుంచి రుణ విముక్తులను చేయాలని కోరుతూ రావిపాడు గ్రామస్థులు శుక్రవారం పోడూరు మండల పరిషత్‌ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. మాజీ ఎంపీపీ పెన్మెత్స రామభద్రరాజు మాట్లాడుతూ గ్రామంలో 86 కుటుంబాల వారికి సంపూర్ణ గృహ హక్కు సంబంధించి రూ.10 వేలు చెల్లించాలంటూ అధికారులు ఒత్తిడి చేస్తున్నారన్నారు. కరోనా, వరుస వర్షాలతో ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం రుణాలు చెల్లించాలంటూ ఒత్తిడి తీసుకురావడం ఏమిటని ప్రశ్నించారు. రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని ఎంపీడీవో కె.కన్నమనాయుడు, తహసీల్దార్‌ ప్రతాపరెడ్డిలకు వినతి పత్రాలను అందజేశారు.


కట్టలేను మొర్రో అంటున్నా.. 

గుత్తుల దశరధుడు, రావిపాడు

ఎప్పుడో 1987లో గవర్నమెంట్‌ లోన్‌తో ఇల్లు కట్టుకున్నాను. అప్పటి నుంచీ ఇప్పటి వరకూ  డబ్బులు కట్టమని ఎవరూ అడగలేదు. ఇప్పుడు నేను వృద్ధాప్యంలో ఉన్నా. పది రోజుల క్రితం వలంటీరును తీసుకుని అధికారులు వచ్చారు. ఇంటి రుణం రూ.5400 బకాయి ఉంది.. ఎప్పుడు కడతావని అడిగారు. కట్టలేనని చెబితే కుదరదంటున్నారు. రోజూ వచ్చి ఒత్తిడి చేస్తున్నారు. లోను కట్టే పరిస్థితిలో లేను.

Advertisement
Advertisement