నరసాపురంలో బంద్ నిర్వహిస్తున్న దృశ్యం
జిల్లా కేంద్రం కావాలంటూ కార్యాలయాలు మూసివేత.. దుకాణాలు తెరవని వ్యాపారులు
నరసాపురం, జనవరి 28 : కొత్తగా ప్రకటించిన పశ్చిమ గోదావరికి భీమవరం కాకుండా నరసాపురాన్ని జిల్లా కేం ద్రంగా ప్రకటించాలంటూ అఖిలపక్ష నాయకులు శుక్రవా రం చేపట్టిన నరసాపురం బంద్ విజయవంతమైంది. వ్యా పారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. ప్రభు త్వ, ప్రైవేట్ కార్యాలయాలు తెరుచుకోలేదు. ఆటోలు తిరగ లేదు. సాయంత్రం వరకు ఇదే పరిస్థితి. అఖిలపక్ష నాయ కులు ఆర్టీసీ బస్టాండ్ వద్ద బైఠాయించి బస్సుల్ని బయ టకు వెళ్లనివ్వలేదు. పోలీసులు వారిని బలవంతంగా డిపో బయటకు తరలించగా కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. పాల కొల్లు రోడ్డుపై రాస్తారోకో చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జనసేన కార్యకర్తలు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించి ఎమ్మెల్యే ముదునూరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వలంధర్ రేవు వద్ద వశిష్ఠ గోదావరిలో జలదీక్ష చేశారు. ఎమ్మెల్యే ముదునూరి నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అఖిలపక్షం నాయకులు నెక్కంటి సుబ్బారావు, పొత్తూరి రామరాజు, బొమ్మిడి నాయకర్, డాక్టర్ ప్రకాష్, కానూరి బుజ్జి, కోటిపల్లి సురేష్, జక్కం శ్రీమన్నారాయణ, కొప్పాడ రవి, కొల్లు పెద్దిరాజు, షేక్ హుస్సేన్, సంకు భాస్కర్, కోటిపల్లి వెంకటేశ్వరావు, ఆకుల వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.