ఇరు పక్షాలకు న్యాయం జరగాలి..

ABN , First Publish Date - 2022-09-24T05:26:42+05:30 IST

నవంబరు 12న నిర్వహించనున్న జాతీయ లోక్‌ అదాలత్‌లో భీమవరం కోర్టు మొదటిస్థానంలో ఉండేలా పోలీ స్‌ అధికారులు, న్యాయవాదులు సహకరించాలని, సివిల్‌ తగాదాలలో గత దావాలను గుర్తించి ఇరుపక్షాలకు సమన్యాయం జరిగేలా శ్రద్థ వహించాలని ఉమ్మడి జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి జి.రాజేశ్వరి కోరారు.

ఇరు పక్షాలకు న్యాయం జరగాలి..


నవంబరు 12న జాతీయ లోక్‌ అదాలత్‌
భీమవరం కోర్టు మొదటిస్థానంలో ఉండేలా సహకరించండి
ఉమ్మడి జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి జి.రాజేశ్వరి

భీమవరం క్రైం/ ఆకివీడు, సెప్టెంబరు 23 : నవంబరు 12న నిర్వహించనున్న జాతీయ లోక్‌ అదాలత్‌లో భీమవరం కోర్టు మొదటిస్థానంలో ఉండేలా పోలీ స్‌ అధికారులు, న్యాయవాదులు సహకరించాలని, సివిల్‌ తగాదాలలో గత దావాలను గుర్తించి ఇరుపక్షాలకు సమన్యాయం జరిగేలా శ్రద్థ వహించాలని ఉమ్మడి జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి జి.రాజేశ్వరి కోరారు. పోలీస్‌ ఉన్నతాధికారులు, న్యాయవాదులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ఆయా కోర్టులలో, పోలీస్‌ స్టేషన్‌లలో పెండింగ్‌లలో ఉన్న రాజీ పడతగిన క్రిమినల్‌ కేసులు, చెక్‌బౌన్స్‌ కేసులు, గేమింగ్‌ యాక్ట్‌ కేసులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. కార్యక్రమంలో 3వ అదనపు జిల్లా న్యాయమూర్తి పి.శ్రీసత్యాదేవి, బి.అప్పలస్వామి, డి.సోని, పి.పవన్‌కుమార్‌, డి.ధనరాజు, ఏఎస్పీ రవికుమార్‌, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వై.న్యూటన్‌, సీనియర్‌ న్యాయవాది పి.నరసింహం, ఎ.వెంకటేశ్వరరాజు, కేవీ రమేష్‌, ఎం.శివకృష్ణ, భీమవరం టౌన్‌, రూరల్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.

గతేడాది 5,650 కేసులు పరిష్కారం
గతేడాది లోక్‌ అదాలత్‌లో 5,650 కేసులు పరిష్కరించారని ఉమ్మడి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి.రాజరాజేశ్వరి తెలిపారు.  ఆకివీడులోని ఐసీడీఎస్‌ కార్యాలయంలో శుక్రవారం అంగన్‌వాడీ వర్కర్స్‌కు బాలల సంరక్షణ, లోక్‌ ఆదాలత్‌, ఎస్సీ, ఎస్టీ యాక్టుపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. 2020 నుంచి ఈ ఏడాది ఇప్పటి వరకు లోక్‌ ఆదాలత్‌ల ద్వారా 80 కేసులకు సంబంధించి బాధితులకు పరిహారం ఇప్పించినట్టు తెలిపారు. ఐసీడీఎస్‌ ఇన్‌చార్జి సీపీడీవో రత్నకుమారి, ఉండి సూపర్‌వైజర్‌ అనిల్‌కుమారి, సీహెచ్‌ హేమలత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-24T05:26:42+05:30 IST