పంచాయతీలు.. విలవిల!

ABN , First Publish Date - 2022-09-05T05:28:37+05:30 IST

నిధులు అందుబాటులో లేవు. ఆస్తిపన్ను రూపంలో వచ్చే నిధులు పంచాయతీ సిబ్బంది వేతనాలు ఇవ్వడానికి సరిపోవడం లేదు.

పంచాయతీలు.. విలవిల!

పడకేసిన పంచాయతీ పాలన
సర్పంచ్‌లకు వదులుతున్న చేతి చమురు
నిధులొస్తాయనుకుంటే ప్రభుత్వం కొర్రీ
తిరిగి జమచేయాలంటూ దిశానిర్దేశం
వేతనాలు ఇవ్వలేని స్థితి.. విధులకు హాజరు కాలేమంటూ సిబ్బంది హెచ్చరికలు


‘సొంత సొమ్ములు పెట్టి గ్రామాన్ని అభివృద్ధి చేశాను. ప్రభుత్వం ఇప్పటి వరకు సొమ్ములు ఇవ్వలేదు. ప్రజల నుంచి వసూలు చేస్తున్న పన్నులు సరిపోవ డం లేదు. కొత్తగా పంచాయతీ భవనాన్ని నిర్మించా రు. సచివాలయాన్ని ఏర్పాటు చేశారు. దాంతో విద్యుత్‌ వినియోగం పెరిగింది. బిల్లులు చెల్లించా లంటే తడిసిమోపడవుతోంది. నాలుగు నెలల నుం చి పంచాయతీలోని అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి జీతాలు చెల్లించడం లేదు. వాటర్‌ ట్యాంక్‌ వద్ద ఉండే ఉద్యోగికి మూడు నెలలనుంచి జీతం ఇవ్వ డం లేదు. జీతం ఇవ్వకపోతే మానే స్తానంటూ ఫోన్‌ చేసి చెపుతున్నాడు.  ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులు వేస్తామని చెప్పినా ఇప్పటివరకు వేయలేదు. పంచాయతీని నిర్వహిం చడం కష్టంగా ఉంది. మా ప్రభుత్వం పరిస్థితి ఏమీ బాగులేదు..’ ఈ మాటలన్నది పెంటపాడు మండ లంలో అధికార పార్టీకి చెందిన ఓ సర్పంచ్‌. ప్రస్తుతం పంచాయతీల దుస్థితికి ఇది అద్దం పడుతోంది.

(భీమవరం–ఆంధ్రజ్యోతి)
ప్రభుత్వం రోజుకో పథకం అమలు చేయాలని చెబుతోంది. పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని దిశానిర్దేశం చేస్తోంది. స్వచ్ఛ సంకల్పం నెరవేరాలని సూచిస్తోంది. రక్షిత మంచినీరు ఇవ్వాల్సిందేనంటోంది. ఇటువంటి కనీస అవసరాలను తీర్చడా నికి పంచాయతీలు ఇబ్బందులు పడుతున్నాయి. నిధులు అందుబాటులో లేవు. ఆస్తిపన్ను రూపంలో వచ్చే నిధులు పంచాయతీ సిబ్బంది వేతనాలు ఇవ్వడానికి సరిపోవడం లేదు. మైనర్‌ పంచాయతీల పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది. ఏడాదికి గరిష్ఠంగా రూ.4 లక్షల ఆదాయం వస్తోంది. పన్నుల రూపేణ వచ్చిన ఆ మొత్తాన్ని సిబ్బంది జీతభత్యాలు, విద్యు త్‌ బిల్లులు, పారిశుధ్య నిర్వహణ, మంచినీటి సరఫరాకు వెచ్చించాలి. అంతకు నాలుగు రెట్లు నిధులు ఉంటేగాని కనీస అవసరాలు తీర్చలేరు. ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సంఘం నిధులతో మిగిలిన లోటును పూడుస్తుంటారు. ఇప్పుడు ఆర్థిక సంఘం నిధులు రావడం లేదు. ఇటీవల 15వ ఆర్థిక సంఘం నిధులు వస్తా యని ప్రభుత్వం హడావిడి చేసింది. పంచాయతీలు కాస్త తెప్పరి ల్లాయి. తీరా ప్రభుత్వం పిడుగులాంటి ఆదేశాలు జారీ చేసింది. ఆర్థిక సంఘం నిధులు  పంచాయతీలకు విడుదలైన వెంటనే ప్రభుత్వ ఖాతాలోకి జమ చేయాలని ఆదేశాలిచ్చిం ది. దాంతో పంచాయతీలు అవాక్కయ్యాయి.  అయితే నిధులు మాత్రం పంచాయతీ ఖాతాలకు జమ కాలేదు. రాష్ట్ర ప్రభు త్వం పంచాయతీల పీడీ అకౌంట్‌ నుంచి నేరుగా నిధులు తీసుకుంటోంది. పంచాయతీ ఖాతాలన్నీ ఖాళీ అయిపోయా యి. వాటిని విద్యుత్‌ బకాయిలకు చెల్లించామంటూ చెప్పుకొ చ్చింది. పంచాయతీలకు జమ అయ్యే ఆర్థిక సంఘం నిధులు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోకుండా కేంద్రం కళ్లెం వేయాలని భా వించింది. అందుకోసం ప్రత్యేకంగా ప్రతి పంచాయతీ పీఎఫ్‌ ఎంఎస్‌ ఖాతాలు తెరచుకోవాలని సూచించింది. జిల్లాలోని అన్ని పంచాయతీలు ఖాతాలు తెరిచాయి. ఇప్పటివరకు నిధు లు మాత్రం జమ కాలేదు. తీరా నిధులు వస్తాయని తల చేసరికి ప్రభుత్వం మరో మెలిక పెట్టింది. నిధులు జమ అయి న వెంటనే పీడీ ఖాతాకు మళ్లించాలని చెప్పుకొచ్చింది. వాటిని రప్పించుకోవడానికి సర్పంచ్‌లు ఆపసోపాలు పడుతున్నారు. ప్రతిరోజు పంచాయతీ నిర్వహణకు సొంత సొమ్ములే దిక్కు అవుతున్నాయి. గతంలో నిధులు పుష్కలంగా ఉండేవి. నీరు–చెట్టు, గ్రామీణ ఉపాధి హామీ పథకం వంటి పనులు నిత్యం నిర్వహిస్తూ ఉండేవారు. ఇటీవల ఆ రెండు పథకాలు అటకెక్కాయి. కేవలం ఆర్థిక సంఘం నిధులపైనే పంచా యతీలు ఆధారపడుతూ వస్తున్నాయి. లేదంటే ఉపాధి హామీ పథకంలో గ్రామంలో డ్రెయినేజీలు శుభ్రపరిచేవారు. పారి ుధ్య నిర్వహణ కొంత మెరుగుపడేది. కేంద్రం నుంచి గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పంచాయతీలకు నిధులు రప్పిం చడంలో  రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. నీరు–చెట్టు పథ కానికి మంగళం పాడారు. ఇక మిగిలింది ఆర్థిక సంఘం నిధు లే. వాటిపైనా ఇప్పుడు ప్రభుత్వం ఒక కన్నేసి ఉంచింది. అదే ఇప్పుడు పంచాయతీలను హడలెత్తిస్తోంది.

కలసి రాని కార్యదర్శులు
 మేజర్‌ పంచాయతీల్లో కాస్త నిధులు అందుబాటులో ఉన్నా కొందరు కార్యదర్శులు కలసిరావడం లేదు. భీమవరం రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని ఓ మేజర్‌ పంచాయతీలో సర్పం చ్‌కు కార్యదర్శి నుంచే కష్టాలు ఎదురవుతున్నాయి. సహాయ నిరాకరణ కొనసాగుతోంది. అదే మండలంలోని మరో మేజర్‌ పంచాయతీలోనూ ఇదే పరిస్థితి. లక్షల రూపాయలు అందు బాటులో ఉన్నా అభివృద్ధికి ఖర్చు పెట్టుకోలేని స్థితిలో ఉన్నా రు.  ప్రతిపక్ష పార్టీకి చెందిన సర్పంచ్‌లు ఉన్న చోట ఇటువంటి పరిస్థితులు అధికంగా కనిపిస్తున్నాయి. లేదంటే రిజర్వ్‌డ్‌ స్థానాల్లో సర్పంచ్‌ల మాట పెడచెవిన పెడుతున్నారు. మొత్తంగా పంచాయతీల్లో సర్పంచ్‌లకు నిధులు, విధుల రూపంలో కష్టకాలం దాపురించింది.


ప్రభుత్వం పంచాయతీలను నీరుగారుస్తోంది..
తాడేపల్లిగూడెం రూరల్‌, సెప్టెంబరు 4:ప్రభుత్వం పంచాయతీలను నీరుగారుస్తోందని సర్పంచ్‌ లు ఆవేదన వ్యక్తం చేశారు. తాడేపల్లిగూడెం ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ వద్ద ఆదివారం తాడేపల్లి గూడెం ప్రతిపక్ష పార్టీ మద్దతుతో గెలిచిన సర్పంచ్‌లు తాడేపల్లిగూడెం మండల సర్పంచ్‌ల చాంబర్‌ అధ్యక్షుడు పీతల బుచ్చిబాబు అధ్యక్షత న సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిపక్ష సర్పం చ్‌లపై వేధింపులకు పాల్పడుతోందని, ఆర్థిక సంఘ నిధులను దారి మళ్లించేందుకు ప్రయత్నిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఉద్యమానికి సిద్ధమవుతున్నామని ముందుగా సోమవారం ప్రజావాణిలో కలెక్టర్‌కు సమస్యలు నివేదించను న్నట్టు తెలిపారు. సర్పంచ్‌లు కూడవల్లి హనుమంతు, పీతల సత్యనారాయణ, శ్రీను, వరలక్ష్మి రాంబాబు పాల్గొన్నారు.



Updated Date - 2022-09-05T05:28:37+05:30 IST