Abn logo
Jun 21 2021 @ 23:32PM

సమస్యలపై గళమెత్తారు

ఏలూరు రూరల్‌, జూన్‌ 21: వివిధ సమస్యలపై, డి మాండ్లు పరిష్కారం కోరుతూ పలు సంఘాలు ఆధ్వర్యం లో సోమవారం నిరసనలు తెలిపి అధికారులకు వినతు లు అందించారు. ఈ మేరకు పది, ఇంటర్‌ పరీక్షలు రద్దు చేయాలని కోరుతూ తెలుగునాడు విద్యార్థి సమాఖ్య టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్డీవో కా ర్యాలయ అధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ సంద ర్భంగా నాయకుడు కొమ్మారెడ్డి మణికంఠ మాట్లాడుతూ పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థులు కొవిడ్‌ బారిన పడే ప్రమా దం ఉందన్నారు. కారేపల్లి పవన్‌, సైదు సతీష్‌, శివ యాద వ్‌, తదితరులు పాల్గొన్నారు. టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ఏలూరు పార్లమెంట్‌ అధ్యక్షుడు పెనుబోయిన మహేష్‌ యాదవ్‌ ఈ నిరసనలో పాల్గొనకుండా దెందులూరులో ఆయనను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. 


ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేయాలి

ఖాళీగా ఉన్న ఉద్యోగాలు తక్షణమే భర్తీ చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సాధన సమితి జిల్లా శాఖ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు సోమ వా రం కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. సమితి నాయకులు కేసీ రాజా మా ట్లాడుతూ గ్రూపు–1, –2లో ఖాళీగా ఉన్న మూడు వేల ఉద్యోగాలు భర్తీ చేయా లని పోలీస్‌ శాఖ, ఇంజనీరింగ్‌, ప్రభుత్వ కళాశాలల్లో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. రెవెన్యూ శాఖతో పాటు ఇతర శాఖలో ఖాళీలు తక్షణం భర్తీ చేసి, నిరుద్యోగ అభ్యర్థుల వయో పరిమితి పెంచాలన్నారు. కె.రజనీ కాంత్‌, ఎ.రాజేష్‌, తదితరులు పాల్గొన్నారు.  


 ప్రభుత్వాస్పత్రిలో ఓపీ సేవలు పునరుద్ధరించాలి 

ఏలూరు కలెక్టరేట్‌, జూన్‌ 21 : ఏలూరు ప్రభుత్వాస్పత్రిని కొవిడ్‌ ఆస్పత్రిగా మార్చి ఓపీ సేవలు నిలిపి వేశారని, ఓపీ సేవలు పునరుద్ధరించాలని జిల్లా చేనే త కార్మిక సంఘం కార్యదర్శి కడుపు కన్నయ్య డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌ వద్ద సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి కలెక్టర్‌కు, అ నంతరం ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నానికి వినతిపత్రాలు అందజేశారు. నాయ కులు పొట్టేలు పెంటయ్య, బండి వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. 


తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఇప్టూ నిరసన 

కొవిడ్‌ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఏలూరు తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఇప్టూ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహిం చారు. ప్రభుత్వ విధానాలను వ్యతి రేకిస్తూ నినాదాలు చేశారు. కొవిడ్‌ బాధితు లను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. తహసీల్దార్‌ సోమశేఖర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. నగర ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు, నగర అధ్యక్షుడు కె.అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.   


నిమ్మ రైతులను ఆదుకోవాలి 

నిమ్మధరలు రోజురోజుకూ దిగజారిపోతూ రైతుల కు కోత ఖర్చులూ రాకపోవడంతో రైతులు దిక్కుతోచ ని  స్థితిలో ఉన్నారని వారిని ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ నరసాపురం పార్లమెంటు తెలుగు రైతు అధ్య క్షుడు పాతూరి రాంప్రసాద్‌ చౌదరి, గుత్తా వెంకటేశ్వ రరావు తదితరులు కలెక్టరేట్‌ పరిపాలనాధికారికి నిమ్మ కాయలు ఇచ్చి నిరసన తెలిపి వినతిపత్రాన్ని అందిం చారు. ధాన్యం అమ్మిన రైతు లకు రెండు నెలలు గడిచినా నేటి వరకూ డబ్బులు అందలేదన్నారు.సాగు ఖర్చులు రాని పరిస్థితిలో నిమ్మ, పుచ్చకాయ రైతులు ఉన్నారన్నారు. ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని  రైతు కూలీల ఆధ్వర్యంలో ప్రభుత్వమే నిర్వహించాలన్నారు. 


అంగన్‌వాడీలకు చేయూత పథకం అమలు చేయాలి 

ఏలూరు టూటౌన్‌, జూన్‌ 21 : అంగన్‌ వాడీ హెల్పర్లు, మినీ వర్కర్లకు చేయూత పథకాన్ని అమలు చేయాలని ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు కె.విజయలక్ష్మి కోరారు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో ఎన్‌.చంద్ర, జి.సుధారాణి పాల్గొన్నారు. 


కులాలను బట్టి ఉపాధి వేతనాలు అమలు రద్దు చేయాలి 

ఏలూరు ఫైర్‌స్టేషన్‌, జూన్‌ 21 : ఉపాధి పనుల్లో పాల్గొన్న కూలీలకు కులాల వారీగా రేట్లు నిర్ణయించడాన్ని రద్దు చేయాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం కేవీపీఎస్‌, డీహెచ్‌పీఎస్‌ సంఘాలు డిమాండ్‌ చేశాయి. ఈ మేరకు సోమవారం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏవోకు వినతిపత్రం సమర్పించారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు పి.రామకృష్ణ, జిల్లా కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దీనికారణంగా కూలీల మధ్య విభేదాలు ఏర్పడుతున్నాయన్నారు. కార్యక్రమంలో పి.పెంటయ్య, ప్రభాకరరావు, తదితరులు పాల్గొన్నారు. 


నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు..

తమ సమస్యలు పరిష్కరించాలంటూ పారిశుధ్య కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ఏపీ మునిసిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో సోమవారం నగర పాలక సంస్థలో కార్మికులు నల్లబ్యాడ్జీలతో తమ నిరసన వ్యక్తం చేశారు. యూనియన్‌ నాయకుడు బి.శ్రీనివాస్‌ మాట్లాడుతూ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ కార్మికులకు నెలకు రూ.24 వేలు వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. జీఎఫ్‌ ఖాతాలు తెరవాలన్నారు. కార్యక్రమంలో ఎ.అప్పల రాజు, పి.శంకర్‌, బి.దుర్గా ప్రసాద్‌, వై.శివకుమార్‌, వై.భాస్కర్‌, ఐ.అశోక్‌, సింహా చలం, దుర్గారావు, పాల్గొన్నారు.