Abn logo
Jan 26 2021 @ 00:09AM

వ్యసనాలు వద్దన్నందుకు అన్నను చంపిన తమ్ముడు

గోపాలపురం, జనవరి 25: వ్యసనాలకు బానిసైన తమ్ముడిని హెచ్చరించడంతో అన్న ప్రాణాల నే తిసేసిన సంఘటన కరగపా డు గ్రామంలో ఆదివారం అర్థరా త్రి చోటు చేసుకున్నది. ఎస్సై తెలిపిన వివరాల మేరకు మండ లంలోని కరగపాడు గ్రామానికి చెందిన మద్దాల సుధీర్‌(24) అతని సోదరుడు మద్దాల సంతోష్‌ అనే యువకులు కూలి పని చేసు కుం టూ తల్లి సంరక్షణలో ఉంటున్నారు. సంతోష్‌ వ్యసనాలకు బానిసై దుబారా ఖర్చులు చేయడంతో పెద్దవాడైన సుధీర్‌ తరచూ తనను మందలిస్తుండడంతో కోపోద్రేకానికి లోనైన సంతోష్‌ ఆదివారం అర్థరాత్రి హత్యకు పథకం వేశాడు. సం తోష్‌ తన స్నేహితుడు విజయ్‌ప్రసాద్‌తో కలిసి ఆదివారం రాత్రి సినిమాకు వెళ్లి తిరిగి వచ్చాడు. నిద్రిస్తున్న అన్న సుధీర్‌ మెడకు తాడు బిగించి హత్య చేశాడు. ఈ విషయాన్ని ఎవరికి చెప్పవద్దని స్నేహితుడిని హెచ్చరించాడు. భయబ్రాంతులకు గురైన ప్రసాద్‌ గ్రామంలో మాజీ సర్పంచ్‌ ఆకుల సుబ్రహ్మణ్యంకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సుబ్రహ్మణ్యం తెలిపారు. సీఐ గౌరీశంకర్‌ను ఘటనా స్థలాన్ని పరిశీలించారు. 


Advertisement
Advertisement
Advertisement