ఆర్టీసీ చార్జీల పెంపుపై వినూత్న నిరసన

ABN , First Publish Date - 2022-07-03T06:53:07+05:30 IST

ప్రతిపక్ష నేతగా పాద యాత్ర చేస్తూ బస్సు చార్జీలు ఒక్క రూపాయి పెంచనని చెప్పి, అధికారంలోకి వచ్చిన మూడేళ్లల్లో మూడుసార్లు వేల కోట్లు బస్సు చార్జీల పెంచిన ఘనత సీఎం వైఎస్‌ జగన్‌కే దక్కిందని ఎమ్మెల్యే డాక్టర్‌ నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామమోహన్‌ ఎద్దేవా చేశారు.

ఆర్టీసీ చార్జీల పెంపుపై వినూత్న నిరసన
ఆర్టీసీ చార్జీల పెంపుపై వినూత్న నిరసన

 బస్సులను కడిగి.. బైఠాయింపు

పాలకొల్లు అర్బన్‌, జూలై 2 : ప్రతిపక్ష నేతగా పాద యాత్ర చేస్తూ బస్సు చార్జీలు ఒక్క రూపాయి పెంచనని చెప్పి, అధికారంలోకి వచ్చిన మూడేళ్లల్లో మూడుసార్లు వేల కోట్లు బస్సు చార్జీల పెంచిన ఘనత సీఎం వైఎస్‌ జగన్‌కే దక్కిందని ఎమ్మెల్యే డాక్టర్‌ నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామమోహన్‌ ఎద్దేవా చేశారు. బస్సు చార్జీల పెంపునకు నిరస నగా స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో ‘బస్సు ఎక్కుదామనుకున్నా– బాదు డే.. బాదుడు’ పేరిట నిరసన కార్యాక్రమాన్ని శనివారం పార్టీ నా యకులతో కలిసి చేపట్టారు. ఈ సందర్భంగా  బస్సులు కడిగి బస్సుల ముందు బైఠాయించి ధర్నా చేశారు. కేంద్ర ప్రభుత్వం డీజిల్‌ ధర తగ్గిస్తే సెస్‌ పేరుతో రివర్స్‌లో సీఎం బస్సు చార్జీలు పెంచి ప్రజలపై పెనుభారం వేసి నడ్డి విరుస్తున్నాడని ఆరోపిం చారు.  పల్లెవెలుగు బస్సులను కూడా చార్జీల మోత నుంచి మిన హాయించలేదని ఆరోపించారు. కార్యక్రమంలో తెలుగు మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కర్నేన రోజారమణి, పలువురు పార్టీ నియోజవర్గ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-03T06:53:07+05:30 IST