ప్రజలను కలిసే హక్కు నాకుంది..

ABN , First Publish Date - 2022-08-09T06:02:55+05:30 IST

పాలకొల్లు పట్టణంలో సోమవారం ఎమ్మెల్యే డాక్టర్‌ నిమ్మల రామానాయుడు చేపట్టిన మహాపాదయాత్రను పోలీసులు అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు.

ప్రజలను కలిసే హక్కు నాకుంది..
సీఐతో ఎమ్మెల్యే నిమ్మల వాగ్వాదం

వైసీపీకి బానిసల్లా మారిన పోలీసులు...
పాదయాత్ర చేస్తే వైసీపీకి ఏమిటీ బాధ...?
ఎమ్మెల్యే డాక్టర్‌ నిమ్మల రామానాయుడు ఆగ్రహం
మహా పాదయాత్రను అడ్డుకునేందుకు పోలీసుల యత్నం

పాలకొల్లు రూరల్‌, ఆగస్ట్‌ 8 : పాలకొల్లు పట్టణంలో సోమవారం ఎమ్మెల్యే డాక్టర్‌ నిమ్మల రామానాయుడు చేపట్టిన మహాపాదయాత్రను పోలీసులు అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. పోలీస్‌ 30 యాక్ట్‌ అమలులో ఉన్నందున మహాపాదయాత్ర వీలుకాదంటూ చెప్పడంతో ఉద్రిక్త వాతావరణ నెలకొంది. ఈ క్రమంలో ఎమ్మెల్యే నిమ్మలకు పట్టణ సీఐ అఖిల్‌జామాకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఎమ్మెల్యే మాట్లాడుతూ ‘ధర్నా, రాస్తారోకో, ముట్టడి చేసేందుకో, దిష్టిబొమ్మ తగులపెట్టేందుకో అయితే నిబంధనలు పెట్టవచ్చు.. అంతేగాని ప్రజల ఓట్లతో గెలిచిన నాకు వారి వద్దకు వెళ్లి సమస్యలను తెలుసుకునే హక్కు ఉంది. వైసీపీ నాయకులు గడపగడపకూ వందలాది మందితో కార్యక్రమం చేస్తే వర్తించని పోలీస్‌ యాక్ట్‌ మాకు మాత్రం ఏమిటి?.. వైసీపీకి ఒక న్యాయం, టీడీపీకి ఒక న్యాయమా?.. జగన్‌ పాదయాత్ర చేసినప్పుడు మేము అధికారంలో ఉన్నాం.. ఆ సమయంలో మేమూ ఈ విధానం అవలం భిస్తే ఒక్క అడుగు కూడా ముందుకు వేసేవారు కాదు.. మేము మీలా కాకుం డా పూర్తిస్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశాం.. వైసీపీ నాయకులు సిగ్గులేని విధానంతో అవసరం లేకపోయినా అడ్డుకుంటున్నారు.. వైసీపీకి పోలీసులు బా నిసల్లా మారారు’.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాపాదయాత్రను అడ్డుకునేందుకు భారీస్థాయిలో పోలీసులు మొహరించడంతో అదేస్థాయిలో నియోజకవర్గంలోని తెలుగుదేశం శ్రేణులు ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌ సార థ్యంలో తరలి వచ్చారు. పట్టణ పోలీసులు ఉన్నతాధికారులకు పరిస్థితి వివరించారు. దీంతో పోలీస్‌ 30 యాక్ట్‌ అమలులో ఉందని చెబుతూ పాదయాత్రకు కేవలం ఐదుగురికి మాత్రమే అనుమతి ఇసు న్నామని తేల్చి చెప్పారు. దీంతో పార్టీ శ్రేణులు నిరాశగా తిరిగి వెళ్లిపోయారు. ఎమ్మెల్యే నిమ్మలతో పాటు మరో ముగ్గురు పార్టీ నాయకులు, ఏ వార్డులో తిరిగితే ఆ వార్డు టీడీపీ ఇన్‌చార్జ్‌  పాదయాత్రను నిర్వహించారు. ఒకటో వార్డులో ఎమ్మెల్యే ప్రజలతో మాట్లాడుతూ ఇళ్లు, ఇళ్ళ స్థలాల పేరు చెప్పి ప్రభుత్వం చేస్తున్న దగా, మోసాన్ని వివరించారు. మూడేళ్ల క్రితమే నిర్మాణం పూర్తయిన 1856 భవనాలు రంగులు మార్చి ఇంత ఆలస్యంగా ఇవ్వడం వల్ల  ప్రతి నెలా అద్దె రూపంలో రూ.5 వేలు నష్టపోయామని, మూడేళ్లల్లో రూ.2లక్షలు నష్టపోయామని వాటిని మాకు ఇప్పించాలంటూ లబ్ధిదారులు విన్నవించినట్టు నిమ్మల తెలిపారు. 6144 ఇళ్లలో మిగిలిన 10 శాతం పనులు పూర్తి చేసి వెంటనే లబ్ధిదారులకు ఉచితంగా అందించాలని, పెదగరువులో 640 ఇళ్లను తక్షణమే నిర్మించాలని, పట్టణ పరిధిలోనే ఇళ్ల స్థలాలను లబ్ధిదారులకు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ఎమ్మె ల్యే వెంట కర్నేని గౌరునాయుడు, పెచ్చెట్టిబాబు, ధనాని సూర్యప్రకాష్‌, వార్డు ఇన్‌చార్జులు పాల్గొన్నారు.


తప్పుడు కేసులకు భయపడేది లేదు..
పాలకొల్లు టౌన్‌, ఆగస్టు 8: తప్పుడు కేసులకు భయపడేదే లేదంటూ జడ్పీ మాజీ చైర్మన్‌ కొక్కిరిగడ్డ జయరాజు అన్నారు. సోమవారం పాలకొల్లులో ఒక ప్రైవేటు కార్యక్రమానికి విచ్చేసిన ఆయన విలేకరులో మాట్లాడుతూ టిడ్కో గృహాల పంపిణీ కార్యక్రమంలో తనను కులం పేరుతో దూషించారంటూ ఎమ్మెల్యే నిమ్మలపై ఒక వైసీపీ నాయకుడు  ఫిర్యాదు చేయగా అట్రాసిటీ కేసు నమోదు చేయడాన్ని తాను ఒక ఎస్సీగా తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. అట్రాసిటీ కేసులను రాజకీయ లబ్ధికి వాడుకోవడం అంటే ఎస్సీ, ఎస్టీల హక్కులను కాలరాయడమేనన్నారు. 

Updated Date - 2022-08-09T06:02:55+05:30 IST