కట్టిపడేసే.. సూక్ష్మకళ

ABN , First Publish Date - 2021-06-13T05:28:31+05:30 IST

చిన్నచిన్న వస్తువులపై కళా ఖండాలను చెక్కాలంటే ఎంతో ఓర్పు, సహనం కావాలి.

కట్టిపడేసే.. సూక్ష్మకళ

ఏలూరు కల్చరల్‌, జూన్‌ 12 : చిన్నచిన్న వస్తువులపై కళా ఖండాలను చెక్కాలంటే ఎంతో ఓర్పు, సహనం కావాలి. అటువంటి మైక్రో ఆర్ట్స్‌ (సూక్ష్మ కళతో) ఏలూరు రూరల్‌ మండలం శనివారపుపేటకు చెందిన దొర శివ ప్రసా ద్‌ అదరగొడుతున్నారు. ఏలూరు రూరల్‌ మండలం శనివారపుపేట ఇందిరా కాలనీకి చెందిన దొర ప్రసాద్‌ చిన్నతనంలోనే మైక్రో ఆర్ట్స్‌పై ఆసక్తి పెంచు కున్నారు. పెన్సిల్‌ ముల్లు, సబ్బు బిళ్ళ, అగ్గిపుల్ల ఇలా కంటికి కనిపించిన వస్తువుపై చిత్రాలను చెక్కుతూ అద్భుతాలను సృష్టిస్తున్నారు. ఇప్పటి వరకూ 500 కళాకృతులను రూపొందించారు. వృత్తిగా చెక్కలపై పేర్లు చెక్కడం, ఫొటోఫ్రేమ్‌లు, సూక్ష్మ కళాకృతులు తయారీ చేసి ఇస్తుంటారు. లాక్‌డౌన్‌ కారణంగా వ్యాపారం డీలా పడడంతో ఇంటి వద్దే ఉంటూ సూక్ష్మ కళా ఖండాలను రూపొందిస్తున్నారు. తాజాగా గోరుపై నిలబడేలా కళ్లజోడును, మేకుపై వేంకటేశ్వరస్వామి ప్రతిమ, పెన్సిల్‌ ముల్లుపై అక్షరాలతో పేరు రూపొందించి ఆకట్టుకున్నారు. 

Updated Date - 2021-06-13T05:28:31+05:30 IST