Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆ ..రెండు గ్రామాల్లో వైద్య పరీక్షలు

కొయ్యలగూడెం, డిసెంబరు 5 : కొయ్యలగూడెం మండలం బోడిగూడెంలో వైద్య శిబిరం కొనసాగుతోంది. నెలరోజుల వ్యవధిలో బోడిగూడెం, మంగం పేట గ్రామాలకు చెందిన నలు గురు విద్యార్థులు మృతి చెంద డంతో ఆందోళనకర పరిస్థితి నెలకొంది. వైద్య శిబిరం ఏర్పాటు చేసి రెండు గ్రామాల్లోని 300 మంది పిల్లలకు పరీక్షలు నిర్వహించారు. ఆదివారం ఎమ్మెల్యే బాలరాజు గ్రామంలో పర్య టిం చారు. అనారోగ్య పరిస్థితులకు కారణాలు, నివారణ చర్యల గురించి నివేదిక ఇవ్వా ల్సిందిగా వైద్య అధికారులను ఆదేశించారు. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు వైద్య శిబిరాలు కొనసాగించాలన్నారు. జిల్లా విద్యాశాఖాఽధికారి రేణుక, జంగా రెడ్డిగూడెం సీఐ సురేష్‌బాబు బోడిగూడెంలో పర్యటించి పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడారు. ఎవరూ ఆందోళన చెందవద్దని తెలిపారు. రెండు గ్రామాల్లోనూ పారి శుధ్య పనులు ముమ్మరం చేశారు. దోమల నివారణకు ఫాగింగ్‌ చేశారు. సర్పంచ్‌ గడ్డియ్య, ఎంపీటీసీ కింగ్‌ పారిశుధ్య పనులను పర్యవేక్షించారు. 

Advertisement
Advertisement