మెడికల్‌ అలవెన్స్‌ కట్‌.!

ABN , First Publish Date - 2022-05-19T05:56:47+05:30 IST

మునిసిపల్‌ పారి శుధ్య కార్మికులకు ఇవ్వాల్సిన మెడికల్‌ అల వెన్సుల్లో ప్రభుత్వం కోత విధించింది.

మెడికల్‌ అలవెన్స్‌ కట్‌.!

 కనీసం పనిముట్లు లేవు.. పారిశుధ్య కార్మికుల వెతలు
తణుకు, మే 18 : మునిసిపల్‌ పారి శుధ్య కార్మికులకు ఇవ్వాల్సిన మెడికల్‌ అల వెన్సుల్లో ప్రభుత్వం కోత విధించింది. జనా భాకు అనుగుణంగా కార్మికుల సంఖ్య పెం చకపోగా, కనీసం పనిముట్లు ఇవ్వడం లే దు. సొంత డబ్బులతో కొనుగోలు చేయాల్సి వస్తోందని పలువురు వాపోతున్నారు. ఎన్నో పోరాటాల తర్వాత ప్రభుత్వం వీరి వేతనాలను రూ.12వేల నుంచి రూ.మూడు వేలు పెంచి రూ.15 వేలు ఇస్తోంది. అయితే వీరికి ఇవ్వాల్సిన మెడికల్‌ అల వెన్సులను నిలిపేసింది. రూ.మూడు వేలు ఇచ్చి ఆరు వేలు ఆపేశారని కార్మి కులు ఆందోళన చెందుతున్నారు. దీంతో జీతం పెరిగిందనే ఆనందం కార్మికు లకు లేకపోయింది. 2019 ఆగస్టు నుంచి కార్మికులకు జీతాలతో పాటు నెలకు 6 వేలు చొప్పున అదనంగా ఇచ్చే వృత్తిపరమైన మెడికల్‌ అలవెన్సును నిలిపి వేసింది. నాలుగు నెలలుగా అలవెన్సులు ఖాతాల్లో పడడం లేదు. జిల్లాలోని భీమవరం, పాలకొల్లు, నరసాపురం, తణుకు, తాడేపల్లిగూడెం, ఆకివీడు ముని సిపాలిటీల్లో పారిశుధ్య కార్మికులు 1,300 మంది వరకు ఉన్నారు. జనాభా పెరుగుతున్నా కార్మికులు సంఖ్య పెరగడం లేదు. దీంతో పని ఒత్తిడితో వారు అనారోగ్యాలకు గురవుతున్నారు. అన్ని మునిసిపాలిటీల్లో  కలిపి మొత్తం మరో 260 మంది కార్మికులు అవసరం.  పారిశుధ్య కార్మికులకు చాలా కాలం నుంచి   చీపుళ్లు, కర్రలు, డ్రెయిన్‌ పారలు, కొంకులు, వీల్‌బార్స్‌, డస్ట్‌బిన్‌లతో పాటు పర్మినెంట్‌ కార్మికులకు బట్టలు, చెప్పులు, కొబ్బరినూనె, సబ్బులు, టవల్స్‌  ఇవ్వడం లేదు. కాగా మెడికల్‌ అలవెన్సు ఆలస్యం అయినప్పటికి కచ్చితంగా వస్తుందని తణుకు మునిసిపల్‌ కమిషనర్‌ సృజన చెప్పారు.


  పనిముట్లు లేకుండా పనులెలా ?
‘మా సమస్యలు ప్రభుత్వం వెంటనే పరి ష్కరించాలి. చాలీచాలని జీతాలతో జీవిస్తున్న మాకు మెడికల్‌ అలవెన్సులు ఆపడం సరికా దు’ అని పారిశుధ్య కార్మికుడు ఆదినారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. ‘పారిశుధ్య కార్మికు లకు పనిముట్లు లేకుండా పనులు ఎలా చేయాలని వై.మంగ వాపోయారు.
  పెరిగిన పని భారంతో..
‘జనాభాకు అనుగుణంగా కార్మికులను పెంచాలి. అవసరాలకు తగ్గట్టు కార్మికులు లేక పనిభారం పెరిగింది. మానసికంగా ఒత్తి డి పెరిగి అనారోగ్యాలు పాలవుతున్నాం’ అని కుసుమ ఆందోళన చెందారు. ‘వేసవిని దృష్టి లో పెట్టుకుని అధికారులు కార్మికులకు మజ్జిగ, ఓఆర్‌ఎస్‌ అందించాలి. ఎండల్లో పనిచేసే కార్మికులకు మేలు జరుగుతుంది’ అని పద్మావతి కోరారు.
 

Updated Date - 2022-05-19T05:56:47+05:30 IST