మావుళ్లమ్మ ఉత్సవాలకు శ్రీకారం

ABN , First Publish Date - 2021-12-09T05:45:21+05:30 IST

మావుళ్లమ్మ 58వ వార్షికోత్సవాలను నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం, మావుళ్లమ్మ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో యథావిధిగా 30 రోజులు పాటు నిర్వహించనున్నారు.

మావుళ్లమ్మ ఉత్సవాలకు శ్రీకారం
పందిరి రాట నిలబెట్టిన ఆలయ కమిటీ సభ్యులు

పందిరి రాట నిలబెట్టిన కమిటీ సభ్యులు

వచ్చే నెల 13 నుంచి ఫిబ్రవరి 11 వరకు ఉత్సవాలు

భీమవరం టౌన్‌, డిసెంబరు 8: మావుళ్లమ్మ 58వ వార్షికోత్సవాలను నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం, మావుళ్లమ్మ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో యథావిధిగా 30 రోజులు పాటు నిర్వహించనున్నారు. గతేడాది కరోనా కారణంగా ఉత్సవాలను 9 రోజులే నిర్వహించారు. ఈ సారి జనవరి 13 నుంచి ఫిబ్రవరి 11 వరకు ఉత్సవాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 11న అఖండ అన్న సమారాధన జరుగుతుంది.ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఆలయ కమిటీ సభ్యులు పందిరిరాట నిలబెట్టారు.ప్రధానార్చకుడు మద్దిరాల మల్లిఖార్జున శర్మ, నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం అధ్యక్షుడు రామాయణం గోవిందరావు చేతుల మీదుగా పూజా కార్యక్రమాలు చేయించారు. కార్యక్రమంలో కమిటీ నాయకులు కొప్పుల సత్యనారాయణ (సత్తిబాబు), కొప్పుల రంగారావు, అప్పన రామకృష్ణ, నరహరశెట్టి అబ్బులు, కొండ, కంచుస్తంభం సత్య నారాయణ, చేగొండి బుజ్జి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-12-09T05:45:21+05:30 IST