ఊపిరి అందడం లేదు.. కాపాడండి

ABN , First Publish Date - 2021-05-09T05:17:45+05:30 IST

నన్ను కాపా డండి.. ఊపిరి అందడం లేదు.. ఇక్కడ ఎవరూ డాక్టర్లు లేరు.. నన్ను ఆస్పత్రిలో చేర్పించండి’.. అంటూ క్వారం టైన్‌ సెంటర్‌లో ఉన్న ఓ వ్యక్తి బంధువులకు ఫోన్‌ చేసి తెలిపాడు.

ఊపిరి అందడం లేదు.. కాపాడండి

సీఆర్‌ఆర్‌ క్వారంటైన్‌ సెంటర్‌లో ఒకరి మృతి

ఏలూరు టూటౌన్‌/ పెదపాడు, మే 8 : ‘నన్ను కాపా డండి.. ఊపిరి అందడం లేదు.. ఇక్కడ ఎవరూ డాక్టర్లు లేరు.. నన్ను ఆస్పత్రిలో చేర్పించండి’.. అంటూ క్వారం టైన్‌ సెంటర్‌లో ఉన్న ఓ వ్యక్తి బంధువులకు ఫోన్‌ చేసి తెలిపాడు. కంగారుపడిన బంధువులు క్వారంటైన్‌ సెంటర్‌ వద్దకు వెళ్లినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే అతను ప్రాణం విడిచాడు. ఆస్పత్రికి తరలిస్తే బతికేవాడని అదే సెంటర్‌లో చికిత్స పొందుతున్న పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. పెదవేగి మండలం దుగ్గిరాల ప్రాంతానికి చెందిన ఇంటూరి అనిమిరెడ్డి (46)కి ఈనెల 5వ తేదీన అనారోగ్యంగా ఉండడంతో ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. కరోనా లక్ష ణాలు కనపడడంతో ఆస్పత్రిలో బెడ్స్‌ ఖాళీలేక సీఆర్‌ఆర్‌ క్వారంటైన్‌ సెంటర్‌కు పంపించారు. అయితే అక్కడి పరిస్థితి బాగోలేదని అనిమిరెడ్డి ఫోన్‌లో శనివారం కుటుంబ సభ్యులకు తెలిపాడు. సెంటర్‌కు వెళ్లిన రోజు నుంచి శనివారం వర కూ ఒక్కసారి మాత్రమే ఒక జూనియర్‌ డాక్టర్‌ వచ్చి దూరంగా ఉండి చూసి వెళ్లిపోయాడని, ఆక్సిజన్‌ లెవెల్స్‌ 85 మాత్రమే ఉందని చెప్పినా పెద్ద డాక్టర్‌ వచ్చి చూస్తాడంటూ వెళ్లిపోయాడని, ఊపిరి ఆడడం లేదని చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదని కుటుంబ సభ్యులకు అతను తెలిపాడు. దీంతో బంధు వులు క్వారంటైన్‌ సెంటర్‌ వద్దకు చేరుకుని ఆస్పత్రికి తరలించాలని ఆందోళన చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చివరకు ఊపిరి అందక అతను మృత్యువాత పడ్డాడు.  

పేరుకే క్వారంటైన్‌ సెంటర్‌

ఏలూరు సీఆర్‌ఆర్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలో క్వారంటైన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. సెంటర్‌కు వచ్చిన బాధితులందరిని క్వారంటైన్‌ సెంటర్‌లో చేర్చుకోవ డం వరకే అధికారులు చేస్తున్నారని, అనంతరం వారి బాగోగులను అసలు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. అక్కడ సరైన సీనియర్‌ డాక్టర్లు ఎవరూ ఉండరు. ఎవరో ఒక జూనియర్‌ డాక్టర్‌, హౌస్‌ సర్జన్‌ చేసే వాళ్లు మాత్రమే ఉంటారు. సిబ్బంది విషయానికి వస్తే ఏఎన్‌ఎంలు, ఆశాలు తప్పితే ఎవరు ఉండరు. మాకు ఊపిరి ఆడడం లేదు మహాప్రభో అన్నా అక్క డ పలికే నాథుడు లేడు. అక్కడ ఉన్న సిబ్బంది కేవలం సమయానికి భోజనం పంపడం, ప్రభుత్వం నిర్దేశించిన మందులను బాధితుడి పేరు చెప్పి ఎక్కడో దూరంగా పెట్టి వెళ్లిపోవడమే అక్కడ వాళ్లు చేసే పని.  శనివారం మృతి చెంది న అనిమిరెడ్డి ఆరోగ్య పరిస్థితిపై అదే కార్వంటైన్‌ సెంటర్‌లో చికిత్స పొందు తున్న ఒక వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో వీడియోను పోస్టు చేశాడు.  మూడు రోజులుగా ఆయన ఆక్సిజన్‌ అందక ఇబ్బంది పడ్డారని, ఆస్పత్రికి తరలిస్తే బతికేవారని ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేయడం ఈ సెంటర్‌ పరిస్థితికి అద్దం పడుతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని క్వారంటైన్‌ సెంటర్‌లో సీనియర్‌ డాక్టర్లను, వైద్య సిబ్బందిని ఉంచి ఎప్పటికప్పుడు బాధితు లను పర్యవేక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని బాధితుల కుటుంబ సభ్యులు   కోరుతున్నారు. 

Updated Date - 2021-05-09T05:17:45+05:30 IST