Abn logo
Jun 19 2021 @ 22:57PM

బడిలో మద్యం సీసాలు..!

 మందుబాబులకు అడ్డాగా మారిన శనివారపుపేట జడ్పీ స్కూల్‌

ఏలూరు రూరల్‌, జూన్‌ 19 : ఏలూరు రూరల్‌ మండలం శనివారపు పేట జిల్లా పరిషత్‌ పాఠశాల మందుబాబులకు అడ్డాగా మారింది. రెండు నెలలుగా పాఠశాలకు వేసవి సెలవులు రావడంతో పాఠశాల ఆవరణలో మందుబాబుల ఆగడాలకు అడ్డూ లేకుండా పోతోంది. మందుబాబులు మందుతాగి ఖాళీ సీసాలు, ఆహార పదార్థాల  వ్యర్థాలు పడేసి వెళ్తున్నారు.  పాఠశాలలో సీసీ కెమెరాలు ఉన్నా వాటిని ధ్వంసం చేసేశారు. పాఠశాలతో పాటు సమీపంలో కొత్తగా ఆర్‌బీకే, సచివాలయం, వెల్‌నెస్‌ సెంటర్‌ నిర్మిస్తున్నారు. అక్కడకు కూడా మద్యం తాగి బాటిళ్లు పారేస్తున్నారు. రాత్రి అయితే చాలు ఆ ప్రాంతంలో రోడ్లమీదే బహిరంగంగా మద్యం తాగు తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మందుబాబు పోలీసులు పటిష్ట చర్యలు తీసుకుని మందు బాబుల ఆగడాలను ఆరికట్టాలని స్థానికులు,ఉపాధ్యాయులు కోరుతున్నారు.