చరిత్ర పుటల్లోకి..కొవ్వూరు రెవెన్యూ డివిజన్‌

ABN , First Publish Date - 2022-01-29T06:06:15+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుకు తెరదీయడం డివిజన్‌ ప్రజలను గందరగోళానికి గురిచేస్తోంది.

చరిత్ర పుటల్లోకి..కొవ్వూరు రెవెన్యూ డివిజన్‌

గోదావరి వెంట 12 మండలాల విస్తీర్ణంలో కొవ్వూరు డివిజన్‌
కొత్త జిల్లాలతో రద్దు.. బంధం తెగిందని పలువురి ఆవేదన
జిల్లా కేంద్రం దగ్గరైందని మరికొందరు హర్షం

కొవ్వూరు, జనవరి 28 : రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుకు తెరదీయడం డివిజన్‌ ప్రజలను గందరగోళానికి గురిచేస్తోంది. ప్రాంతాల భౌగోళిక స్వరూపాలు, ప్రజల అవసరాలు పట్టకుండా కేవలం రాజకీయ క్రీడగానే జిల్లాల ఏర్పాటు జరుగుతోందని విమర్శలు చేస్తున్నారు. కొవ్వూరు రెవెన్యూ డి విజన్‌ స్వరూపం పూర్తిగా మారడంతోపాటు పశ్చిమ నుంచి తూర్పులో కలిసింది. ఈ నిర్ణయంపై ప్రజల నుంచి భిన్నస్వ రాలు వినిపిస్తున్నాయి. కొందరు ఎటూ తేల్చలేక నిట్టూరుస్తున్నారు. జిల్లాల పునర్విభజనతో కొవ్వూరు రెవెన్యూ డివిజన్‌ మూడు ముక్కలైంది. అఖండ గోదావరి తీరం వెంబడి 12 మండలాలతో విస్తరించి ఉన్న డివిజన్‌ను కొత్త జిల్లాల పేరు తో ముక్కలు చేయడంతో ప్రజలను కలిచివేస్తోంది. డివిజన్‌ పరిధిలోని పెనుగొండ, పెనుమంట్ర మండలాలు నరసాపురం డివిజన్‌లో, అత్తిలి, ఇరగవరం, తణుకు మండలాలు భీమవరం డివిజన్‌లో కలపనున్నారు. తూర్పు గోదావరి జిల్లా లోని రాజమహేంద్రవరం పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో పెద్దగా మార్పు లేనప్పటికి కొవ్వూరు డివిజ న్‌ పరిధిలోని చాగల్లు, దేవరపల్లి, తాళ్లపూడి, కొవ్వూరు, నిడదవోలు, ఉండ్రాజవరం, పెరవలి మండలాలతోపాటు ఏలూరు డివిజన్‌ నుంచి ద్వారకా తిరుమల, నల్లజర్ల, జంగారెడ్డిగూడెం నుంచి గోపాలపురం మండలాలతో కలుపుతూ కొత్తగా కొవ్వూ రు రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూ రు రెవెన్యూ డివిజన్‌ను తూర్పు గోదావరి జిల్లాలో కలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయడంతో స్థా నిక నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఏదైనా సమస్య ఉంటే పరిష్కారానికి జిల్లా కేంద్ర మైన ఏలూరుకు 80 కిలోమీటర్లు వ్యయ ప్రయాసలకు గురవుతూ వెళ్లాల్సి వ చ్చేది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో కొవ్వూరు డివిజన్‌ను రాజమహేంద్రవరం కేంద్రంగా ఏర్పడే తూర్పు గోదావరిలో కలపడంతో జిల్లా కేంద్రం కొవ్వూరుకు కేవలం 5 కి.మీ దగ్గరలో ఉండడంతో కొందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ లో కొవ్వూరు డివిజన్‌ శివారుగా ఉండడంతో ఇప్పటి వరకు నాయకులు, అధికారుల నిర్లక్ష్యానికి గురైంది. కొత్తగా ఏర్పడే జిల్లాలో కొవ్వూరు డివిజన్‌ జిల్లా కేంద్రం రాజమహేంద్రవరానికి అత్యంత చేరువలో ఉండడంతో డివిజన్‌ మరింత అభివృ ద్ధి చెందుతుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

  శాస్త్రీయత లేని జిల్లాల విభజన
కొత్త జిల్లాల ఏర్పాటు రాజకీయ గందరగోళం సృష్టించేదిగా ఉంది. భౌగోళిక స్వరూపాలు, ప్ర జల అవసరాలను పరిగణనలోకి తీసుకోకుండా కేవలం ఉద్యోగుల సమ్మె నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి మాత్రమే జిల్లాల ప్రకటన చేశారు. జనగణన జరగకుండా కొత్త జిల్లాల ఏర్పాటుకు కేంద్రం ఆమోదించదని తెలిసినా ఉద్దేశ పూర్వకంగానే జగన్‌ చేసిన ఈ ప్రకటన రాష్ట్రంలో అమరావతి, పోలవరం ప్రాజెక్టు, విశాఖ ఉక్కు వంటి విషయాలను వదిలి ప్రజలంతా జిల్లాల గురించి మాట్లాడుకునే రాజకీయ క్రీడగా భావించాలి.
– మాజీ మంత్రి కేఎస్‌ జవహర్‌

Updated Date - 2022-01-29T06:06:15+05:30 IST