రైతు కవాతు

ABN , First Publish Date - 2021-01-27T05:42:02+05:30 IST

వినాశకర కేంద్ర వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం ఏలూరులో రైతు, వ్యవ సాయ, కార్మిక, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రైతు కవాతు నిర్వహించారు.

రైతు కవాతు
ఏలూరులో ఎడ్ల బండిపై కిసాన్‌ సెల్‌ నాయకులు

ఎడ్ల బళ్లు, ట్రాక్టర్లు, డప్పు కళాకారులతో కదం తొక్కిన అన్నదాతలు

ఏలూరు కార్పొరేషన్‌, జనవరి 26 : వినాశకర కేంద్ర వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం ఏలూరులో రైతు, వ్యవ సాయ, కార్మిక, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో  రైతు కవాతు నిర్వహించారు. పాతబస్టాండ్‌ సెంటర్‌ నుంచి జూట్‌మిల్లు మీదుగా ఫైర్‌స్టేషన్‌ సెంటర్‌, కలెక్టరేట్‌ వరకు కొనసాగింది. ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు, డప్పు కళాకారులతో అన్నదాతలు కదం తొక్కారు. కవాతు ముగింపులో జరిగిన సభకు ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్‌ అధ్యక్షత వహించారు. సభలో ఏపీ రైతు సంఘాల పోరాట సమన్వయ కమిటీ రాష్ట్ర నాయకులు, కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి, కిసాన్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు జెట్టి గురునాథరావు, ఏఐటీయూసీ జిల్లా నాయకులు డేగా ప్రభాకర్‌, బండి వెంకటేశ్వరరావు, ఇఫ్టూ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరావు, సీఐటీయు జిల్లా అధ్యక్షుడు బి.సోమయ్య ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు నెలలుగా ఢిల్లీలో లక్షలాది రైతాంగం  ఆహార భద్రత కోసం పోరాడుతున్నా కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తున్నదన్నారు.


Updated Date - 2021-01-27T05:42:02+05:30 IST