నిర్లక్ష్యం నీడలో జన్మభూమి

ABN , First Publish Date - 2022-01-20T06:08:09+05:30 IST

ఏలూరు నగరంలో టీటీడీ కల్యాణ మండ పం ఎదురుగా 2003లో అప్పటి ప్రభుత్వం రూ.25 లక్షలతో జన్మభూమి ఉద్యానవనం పేరుతో పార్కును నిర్మించారు.

నిర్లక్ష్యం నీడలో జన్మభూమి
పార్కు దుస్థితి

ఆలనాపాలనకు నోచుకోని పార్కు

యథేచ్ఛగా అసాంఘిక కార్యకలాపాలు

బహిర్భూమి స్థలంగా వినియోగం

రూ.25 లక్షలు నిరుపయోగం

దాతల మహోన్నత ఆశయానికి తూట్లు

ఆవేదన వ్యక్తం చేస్తున్న నగరవాసులు


జన్మభూమి పార్కు.. ఈపేరు చెబితే ఒకప్పుడు పచ్చని మొక్కలతో ఆహ్లాదకర వాతారణం స్ఫురణకు వచ్చేది.. నగరవాసులు సాయంత్రం వేళ ఈ పార్కుకు వచ్చి సేద తీరేవారు.. అయితే ప్రస్తుతం ఈ పార్కు పేరు చెబితేనే ఆమడ దూరం పారిపోయే పరిస్థితి నెలకొంది. గత ప్రభుత్వం చేపట్టిన ‘జన్మభూమి’ కార్యక్రమం నిధులు, దాతలు సహకారంతో ఏర్పడిన ఈ పార్కు నేడు అధ్వానంగా మారింది.



ఏలూరు కార్పొరేషన్‌, జనవరి 19 : ఏలూరు నగరంలో టీటీడీ కల్యాణ మండ పం ఎదురుగా 2003లో అప్పటి ప్రభుత్వం రూ.25 లక్షలతో జన్మభూమి ఉద్యానవనం పేరుతో పార్కును నిర్మించారు.  2003వ సంవత్సరంలో నిర్మించిన ఈ పార్కును అప్పటి రాష్ట్ర గవర్నర్‌ సుర్జీత్‌ సింగ్‌ బర్నాలా ప్రారంభించారు. అప్పటి కలెక్టర్‌ సంజయ్‌జాజు ఎంతో శ్రద్ధ వహించి ఈ పార్కు నిర్మాణానికి కష్టపడి అధికార యంత్రాంగాన్ని, దాతలను సమాయత్తం చేశారు. నాటి ఎమ్మె ల్యే అంబికా కృష్ణ, నాటి మునిసిపల్‌ చైర్మన్‌ మధ్యాహ్నపు ఈశ్వరీ బలరాం ఈ పార్కు అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేశారు. నాటి ప్రజా ప్రతి నిధులు, అధికార యంత్రాంగం ఎంపీ నిధులు రూ.ఎనిమిది లక్షలు, ప్రభుత్వ సంస్థల నిధులు మరో రూ.8 లక్షలు, మునిసిపల్‌ నిధులు రూ.3 లక్షలు, జన్మభూమి నిధులు రూ.1.50 లక్షలు, ఏలూరు ట్రేడ్‌ఫెయిర్‌ లాభాలు రూ.2.50 లక్షలు, ఆశ్రం ఆస్పత్రి 50 వేలు, అప్పటి సర్పంచ్‌ ఉండవల్లి సత్యనారాయణ రూ.50 వేలు, ఓడూరు సర్పంచ్‌ పి.వి.వి.ఎస్‌.రవివర్మ రూ.50 వేలు, ఇతరులు మరో రూ.50 వేలు ఇవ్వగా మొత్తం రూ.25 లక్షలతో ఇరిగేషన్‌, మునిసిపల్‌, జడ్పీ, రెవెన్యూ, గృహ నిర్మాణ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో దాదాపు వెయ్యి గజాల స్థలంలో నిర్మించారు. 


అధ్వానంగా పార్కు.. శిథిలమవుతున్న కట్టడాలు

ఆ పార్కులో ఆహ్లాదకరంగా ఉండేందుకు కట్టడాలు నిర్మించారు. కొంతకాలం ఈ పార్కు నిర్వహణ సక్రమంగానే సాగింది. అనంతరం ఆలనాపాలనా లేకపోవడంతో అధ్వానంగా మారింది. అసాం ఘిక కార్యకలాపాలకు నిలయంగా, బహిర్భూమికి పార్కును వినియోగిస్తున్నారు. కాలక్రమేణ ఆలనాపాలనా లేకపోవడంతో నేడు శిఽథిలా వస్థకు చేరుకుంది. టీటీడీ కల్యాణ మండపం ఎదురుగా ఉన్న ఈ పార్కు ఎంతో విలువైన స్థలం. ఈ పార్కును అభివృద్ధి చేసి నగర ప్రజలకు సేద తీరేందుకు ఆహ్లాదకర వాతావరణం కల్పించాలని పలువురు కోరుతున్నారు. 

Updated Date - 2022-01-20T06:08:09+05:30 IST