రేపటి నుంచి వంతుల వారీ..

ABN , First Publish Date - 2021-01-24T05:37:06+05:30 IST

పశ్చిమ డెల్టా పరిధిలోని రబీ రైతాం గానికి వంతుల వారీ విధానాన్ని ఈ నెల 25వ తేదీ నుంచి అమలు పరుస్తున్నట్లు నీటి పారుదల శాఖ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ దక్షిణా మూర్తి తెలిపారు.

రేపటి నుంచి వంతుల వారీ..

నిడదవోలు, జనవరి 23: పశ్చిమ డెల్టా పరిధిలోని రబీ రైతాం గానికి వంతుల వారీ విధానాన్ని ఈ నెల 25వ తేదీ  నుంచి అమలు పరుస్తున్నట్లు నీటి పారుదల శాఖ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ దక్షిణా మూర్తి తెలిపారు. జిల్లాలోని ప్రధాన కాలువలైన ఏలూరు కెనాల్‌, ఉండి కెనాల్‌, జీ అండ్‌ వీ కెనాల్‌, అత్తిలి కెనాల్‌, నర్సాపురం కెనాల్‌ తదితర కెనాల్స్‌లో వంతుల వారీ విధానం ఉంటుందని తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, రెండో వంతుకు సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు రబీ రైతాంగానికి నీటి పారుదలశాఖాధికారులు నీటిని అందించ నున్నారు. రబీలో ఎక్కడా నీటి సమస్య తలెత్తకుండా కాల్వలన్నీ పూల్‌ సప్లయ్‌ లెవల్‌లో నీటిని విడుదల చేయనున్నారు.   


Updated Date - 2021-01-24T05:37:06+05:30 IST