ఏ జిల్లా.. ఏ జిల్లా.. ఇదే జిల్లా?

ABN , First Publish Date - 2022-01-29T06:09:36+05:30 IST

జిల్లాల విభజన గజిబిజి వెంకట్రామన్నగూడెం డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఉద్యాన విశ్వ విద్యాలయాన్ని తాకుతోంది.

ఏ జిల్లా.. ఏ జిల్లా.. ఇదే జిల్లా?

ఉద్యాన వర్సిటీ ముఖద్వారం పశ్చిమలో.. క్యాంపస్‌ భూములు ఏలూరులోకి..

తాడేపల్లిగూడెం, జనవరి 28(ఆంధ్రజ్యోతి): జిల్లాల విభజన గజిబిజి వెంకట్రామన్నగూడెం డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఉద్యాన విశ్వ విద్యాలయాన్ని తాకుతోంది. తాడేపల్లిగూ డెం రూరల్‌ పరిధిలో ఉన్నట్టు రికార్డుల్లోవున్నా క్యాంపస్‌ భూములన్నీ ఉంగుటూరు మండలం రెవెన్యూలో ఉన్నా యి. విశ్వ విద్యాలయం సుమారు 199 ఎకరాల్లో విస్తరిం చి ఉంది. ముఖద్వారం వెంకట్రామన్నగూడెం పరిధిలోకి వస్తుంది. మిగిలిన భూములన్నీ ఉంగుటూరులో ఉండ డంతో జిల్లా విభజన జరిగితే విశ్వ విద్యాలయం ఏ జిల్లా లోకి వస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. గతంలో వర్సిటీ కార్యక్రమాలకు అధికారులు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేను ఆహ్వానించేవారు. టీడీపీ ప్రభుత్వ హయాం లో విశ్వ విద్యాలయ భూములు ఉంగుటూరు పరిధిలో ఉన్నాయని తేల్చారు. అప్పటి నుంచి ఉంగుటూరు ఎమ్మె ల్యేను మర్యాద పూర్వకంగా పిలుస్తూ ప్రొటోకాల్‌ పాటి స్తున్నారు. వెంకట్రామన్నగూడెం సర్పంచ్‌ను గౌరవిస్తున్నా రు. ఇలా ఇప్పుడు రెండు నియోజకవర్గాల పరిధిలో ప్రజా ప్రతినిధులకు అధికారులు పెద్దపీట వేస్తున్నారు. రెండు నియోజకవర్గాల్లో ఒకే జిల్లాలో ఉండడంతో పెద్దగా సమస్య లేదు. భవిష్యత్తులో జిల్లాలు మారితే ఉంగుటూ రు నియోజకవర్గంలో ఏలూరు జిల్లాలోకి వెళుతుంది. తాడేపల్లిగూడెం నియోజకవర్గం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంటుంది. అప్పుడు విశ్వ విద్యాలయం ఏ జిల్లాలో ఉన్నట్టు పరిగణిస్తారనేది ఆసక్తిగా మారింది. 

Updated Date - 2022-01-29T06:09:36+05:30 IST