అమ్మో.. మంటలెక్కడివీ..!

ABN , First Publish Date - 2021-04-17T05:23:22+05:30 IST

ఏమైందో తెలియదు.. ఆకాశంలో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడటంతో ప్రజలు ఒక్కసారిగా ఉలి క్కిపడ్డారు.

అమ్మో.. మంటలెక్కడివీ..!
ఆకాశంలో మంటలు

– నరసాపురం 

ఏమైందో తెలియదు.. ఆకాశంలో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడటంతో ప్రజలు ఒక్కసారిగా ఉలి క్కిపడ్డారు. వెంటనే అధికా రులకు సమాచారం ఇవ్వ డంతో అందరూ కలిసి మం టలు వస్తున్న చోటుకు వెళ్లారు. ఆరా తీస్తే తవ్వ కాల్లో బయటపడిన గ్యాస్‌ సామర్ధ్యాన్ని పరిశీలించేందు కు పరీక్షలు నిర్వహిస్తు న్నా మని ఓఎన్‌జీసీ అధికారులు చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నరసాపురం మండలం సీతారాంపురం నార్త్‌లో ఈ ఘటన  శుక్ర వారం చోటు చేసుకుంది. ఏడాదిన్నర క్రితం ఓఎన్‌జీసీ ప్రైవేట్‌ సంస్థతో కలిసి గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో చమురు నిక్షేపాల కోసం అన్వేషణ చేపట్టింది. మూడు కిలోమీటర్లు చేపట్టిన తవ్వకాల్లో గ్యాస్‌ వెలుగుచూసింది. ఇందులో నీరు, ఆయిల్‌, గ్యాస్‌ సామర్థ్యాన్ని గుర్తించేందుకు ఓఎన్‌జీసీ ఫైర్‌ పరీక్ష చేసిం ది. ఈ సమాచారం పరిసర గ్రామస్థులకు, అధికారులకు లేదు. ఒక్కసారిగా మంటలు రావడంతో అధికారులంతా కంగారు పడ్డారు. దీనిపై ఓఎన్‌జీసీ ప్లాంట్‌ అధికారి ఎం.ప్రభాకర్‌ విలేకర్లతో మాట్లాడుతూ తవ్వకాల్లో వెలుగు చూసిన నిక్షేపాలు పరీక్షించేందుకు ఇటువంటి పరీక్షలు నిర్వహించడం సర్వసాధారణమన్నారు. రెండు, మూడు రోజుల పరీక్షల తర్వాత నిక్షేపాలపై అంచనాకు వచ్చి.. తర్వాత రిగ్గును మూసివేస్తామని చెప్పారు. 

Updated Date - 2021-04-17T05:23:22+05:30 IST