Abn logo
Aug 1 2021 @ 00:50AM

గోదావరిలో దూకి కుటుంబం గల్లంతు ?

చించినాడ బ్రిడ్జిపై బైక్‌, బట్టలు

యలమంచిలి, జూలై 31 : తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం డి.గన్నవరం గ్రామానికి చెందిన ఒక కుటుంబం అదృశ్యమైంది. కంచి సతీష్‌ (34), భార్య సంఽధ్య (28), వారి పిల్లలు జస్విన్‌ (4), శ్రీదుర్గ (2)లు నాలుగు రోజులుగా గ్రామంలో కనిపించడంలేదు. ఇదిలా ఉండగా  శనివారం గస్తీ తిరుగుతున్న పాలకొల్లు పోలీసులకు చించినాడ బ్రిడ్జిపై మోటారుసైకిల్‌, నలుగురు కుటుంబసభ్యుల చెప్పులు, చిన్నపిల్లల దుస్తులు కనిపించాయి. ఇవి అదృశ్యమైన నలుగురు కుటుంబ సభ్యులకు చెందినవిగా భావిస్తున్నారు.  కుటుంబ కలహాల నేపఽథ్యంలో వీరు ఆత్మహత్యకు పాల్పడ్డారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా సంధ్య రాసిన ఓ లెటర్‌ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. తాము ఆత్మహత్యకు పాల్పడడానికి బంధువుల వేధింపులు కారణమని పేర్కొంటూ ఆ లెటర్‌ సారాంశం. కాగా సతీశ్‌ కుటుంబం అదృశ్యమైనట్టుగా పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పోలీస్‌స్టేషన్‌లో శనివారం వెలివెలకు చెందిన బంధువులు ఫిర్యాదు చేశారు.