చీకటి జీవోలను రద్దు చేయాలి

ABN , First Publish Date - 2022-01-28T05:17:37+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పట్ల నిరంకుశత్వంగా వ్యవహరిస్తూ చీకటి జీవోలను విడుదల చేసిం ద ని, వాటిని రద్దు చేయాలని జన సేన ఏలూరు ఇన్‌చార్జ్‌ రెడ్డి అప్పలనాయుడు డిమాండ్‌ చేశారు.

చీకటి జీవోలను రద్దు చేయాలి
ఏపీ మునిసిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో నిరసన

ఏలూరు కార్పొరేషన్‌, జనవరి 27: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పట్ల నిరంకుశత్వంగా వ్యవహరిస్తూ చీకటి జీవోలను విడుదల చేసిం ద ని, వాటిని రద్దు చేయాలని జన సేన ఏలూరు ఇన్‌చార్జ్‌ రెడ్డి అప్పలనాయుడు డిమాండ్‌ చేశారు. జనసేన కార్యా లయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా డుతూ ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీకి కోత విధించడం సరైనది కాదన్నా రు. ఉద్యోగుల ఆందోళనలు, గుడివాడలో పేకాట క్లబ్‌లు, కేసినో నిర్వహణ విషయా లను పక్కదారి పట్టించేందుకు తెరపైకి 26 జిల్లాల ప్రతిపాదనలు ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. 2011 గణాంకాల ప్రకారం జిల్లాల విభజన చేయడానికి వీల్లేదన్న కేంద్ర ప్రభుత్వ ప్రకటనను గాలికొదిలేసిందన్నారు. ఇంకా పూర్తికాని 2021 జనాభా లెక్కలను అంచనా ఎలా వేశారని ఆయన ప్రశ్నించారు. సమా వేశంలో జనసేన నాయకులు నగిరెడ్డి కాశీ నరేష్‌, సరిది రాజేష్‌, బొత్స మధు, గుబ్బల నాగేశ్వరరావు, అల్లు సాయిచరణ్‌, రవి, పసుపులేటి దినేష్‌, రమణ, కృపానందం పాల్గొన్నారు.

పీఆర్సీ సాధన కమిటీకి మద్దతు

ఏలూరు కార్పొరేషన్‌, జనవరి 27 : చీకటి జీవోలను రద్దు చేయాలని కోరు తూ పీఆర్సీ సాధన సమితి పేరుతో పోరాడుతున్న ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్ల కాంట్రాక్టు ఉద్యోగుల పోరాటానికి తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు రిటైర్డ్‌ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డి.వి.సుబ్బారావు తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ సాధన సమితి చేస్తున్న పోరాటం న్యాయ సమ్మతమ న్నారు. వారు సమ్మెలోకి వెళ్లకముందే ప్రభుత్వం స్పందించి వారి సమస్యలను సానుకూలంగా పరిష్కరించాలని సూచించారు.

ఆమోదయోగ్యమైన పీఆర్సీని ప్రకటించాలి
ఏలూరు టూటౌన్‌, జన వరి 27: అందరికీ ఆమోద యోగ్యమైన పీఆర్సీని ప్రక టించాలని ఏపీ మునిసిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ గౌరవ అధ్యక్షులు పి.కన్నబాబు, భజంత్రీ శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. ఏఐటీయూసీ జిల్లా కార్యాలయం వద్ద గురువారం రివర్స్‌ పీఆర్సీ ప్రతులను దహనం చేశారు. అనంతరం నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కన్నబాబు, శ్రీనివాస్‌ మాట్లాడుతూ 11వ పీఆర్సీ తో రెగ్యులర్‌ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగ కార్మికులకు తీరని నష్టం జరుగుతోందన్నారు. పీఆర్సీని రద్దు చేసి అందరికీ ఆమోదయోగ్యమైన పీఆర్సీని ప్రకటించాలన్నారు. ఫిబ్రవరి 7న తలపెట్టిన సమ్మెను జయప్రదం చేయాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎ.శివకుమార్‌, సి.హెచ్‌.మోజెస్‌, బంగారు దుర్గాప్రసాద్‌, కోలా భాస్కర్‌, గేదెల నాగేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-28T05:17:37+05:30 IST