జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్‌ మేనేజర్‌గా వెంకట్రావు బాధ్యతల స్వీకరణ

ABN , First Publish Date - 2021-04-17T05:04:21+05:30 IST

జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్‌ మేనేజర్‌గా ఆర్‌.వెంకట్రావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.

జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్‌ మేనేజర్‌గా వెంకట్రావు బాధ్యతల స్వీకరణ

ఏలూరు సిటీ, ఏప్రిల్‌ 16: జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్‌ మేనేజర్‌గా ఆర్‌.వెంకట్రావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ డీఐసీలో డీడీ గా పనిచేస్తూ పదోన్నతిపై జిల్లా డీఐసీ జనరల్‌ మేనేజరుగా నియ మితుల య్యారు. గతంలో వెంకట్రావు, జిల్లాలో 2003 నుంచి 2005 వరకు డీఆర్‌డీఏలో అడిషినల్‌ ప్రాజెక్టు డైరక్టర్‌గా, 2012 నుంచి 2014 వరకు డీఐసీలో డిప్యూటీ డైరక్టర్‌గా పని చేశారు. ప్రస్తుతం ఇన్‌చార్జి జీఎంగా ఉన్న పి.ఏసుదాస్‌ నుంచి ఆ యన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన కలెక్టర్‌ ముత్యాలరాజును మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. 

Updated Date - 2021-04-17T05:04:21+05:30 IST