Advertisement
Advertisement
Abn logo
Advertisement

తేలని అంబేద్కర్‌ విగ్రహ సమస్య

గరగపర్రులో అంబేడ్కర్‌ విగ్రహ సమస్యను పరిష్కరించాలంటూ వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి నిరసన తెలుపున్న యువకులు

వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి దళితుల నిరసన

పాలకోడేరు, డిసెంబరు 4 : పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రులో అంబేద్కర్‌ విగ్రహ సమస్య పరిష్కరించాలని కోరుతూ గ్రామ దళితులు శనివారం గ్రామ సచివాలయాన్ని ముట్టడించి, వాటర్‌ ట్యాంకు ఎక్కి నిరసన తెలిపారు. తొమ్మిది రోజులుగా అంబేద్కర్‌ విగ్రహ సమస్య పరిష్కరించాలని కోరుతూ దళితులు ధర్నా చేస్తున్నారు. అటు సీఎం, ఇటు జిల్లా కలెక్టర్‌ పట్టించుకోకపోవడంతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేలా ఆందోళన చేశారు. సచివాలయం ముట్టడించే క్రమంలో సర్పంచ్‌ అక్కడ లేకపోవడంతో సర్పంచ్‌, కలెక్టర్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నాలుగేళ్లుగా  సమస్య పట్టించుకోకపోవడం దారుణమని కొందరు యువకులు వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి నిరసన తెలిపారు. సిరింగల వెంకటరత్నం, దళిత నాయకులు సుందరకుమార్‌లతో రూరల్‌ సీఐ నాగమురళి సబ్‌ కలెక్టర్‌తో సమావేశం ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. 

Advertisement
Advertisement