Abn logo
Mar 4 2021 @ 00:03AM

రైతన్నపై ఎరువుల పిడుగు

డీఏపీ, కాంప్లెక్స్‌ బస్తాపై రూ.150–250 పెంపు

ఆర్థికంగా చితికిపోతున్న చిన్న, సన్న కారు రైతులు 

ఏలూరు రూరల్‌, మార్చి 3: వ్యవసాయంతో చితికిపోతున్న రైతుకు మరో షాక్‌ తగిలింది. మార్కెట్లో ముడి సరుకు ధర పెరి గిందని కంపెనీలు ఎరువుల ధరలు పెంచేశాయి. నేడో రూపో  పెంచిన ధరలు అమలులోకి రానున్నాయి. డీఏపీ 50 కిలోల బస్తాపై రూ.250, కాంప్లెక్స్‌ బస్తాపై రూ.150 పెరగనుంది. పెరిగిన ధరలు అమ లులోకి వస్తే రైతులపై అదనపు భారం పడనుంది. రైతు భరోసా పేరుతో కొసరు ఇచ్చి రసాయన ఎరువులు, పురుగు మందుల ధరలు పెంచేసి కష్టజీవులను నిలువునా ముంచుతున్నారు. మండలంలో ఖరీఫ్‌ ప్రారంభానికి ముందే ఎరు వుల ధరలు పెంచడంపై అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. మండలంలో 16 వేల హెక్టార్లల్లో వరి సాగు చేస్తున్నారు. యూరియా, డీఏపీ, కాంప్లెక్స్‌, ఎస్‌ఎస్‌పీ వంటి రసాయన ఎరువులు ఆయా పంటలకు వేస్తున్నారు. ఖరీఫ్‌, రబీ పంటలకు ఏటా 50 వేల మెట్రిక్‌ టన్నుల రసాయన ఎరు వులు అవసరం అని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు. అధికారు ల సిఫార్సు కంటే రైతులు రెట్టింపు ఎరువులు వినియోగిస్తున్నారు. డీఏపీ 50 కిలోల బస్తాపై రూ.250, కాంప్లెక్స్‌ బస్తాపై రూ.150 వరకూ పెరిగే అవకాశం ఉందని ఇప్పటికే ఎరువుల డీలర్లకు ఫెర్టిలైజర్స్‌ కంపెనీలు సంకే తాలు పంపాయి. ఏప్రిల్‌ 1 నుంచి పెంచిన ధరలు అమలులోకి వస్తాయని పురుగు మందుల విక్రయదారుల సంఘ నాయకులు తెలిపారు. 


Advertisement
Advertisement
Advertisement