ఏడు గ్రామాల విలీనం రాత మార్చేనా..!

ABN , First Publish Date - 2021-02-27T05:33:48+05:30 IST

హేలాపురిగా పిలవబడే ఏలూరుకు ఎంతో ఘన చరిత్ర ఉంది.. అయితే అభివృద్ధి విషయంలో వెనుకబడే ఉంది

ఏడు గ్రామాల విలీనం   రాత మార్చేనా..!

ఏలూరులో ఏడు గ్రామాల విలీనంతో  పెరిగిన విస్తీర్ణం, జనాభా

అభివృద్ధికి నోచుకోని నగరం.. రాబోయే  పాలక మండలిపైనే ఆశలు


ఏలూరు ఫైర్‌స్టేషన్‌, ఫిబ్రవరి 26 :

హేలాపురిగా పిలవబడే ఏలూరుకు ఎంతో ఘన చరిత్ర ఉంది.. అయితే అభివృద్ధి విషయంలో వెనుకబడే ఉంది. మునిసిపాలిటీ స్థాయి నుంచి నగర పాలక సంస్థగా ఏర్పడినా సమస్యలు ఎక్కడవి అక్కడే ఉన్నాయి. జనాభాకు తగ్గ మౌలిక వసతుల కల్పన అంతంతమాత్రంగా ఉందనేది నగర వాసుల అభిప్రాయం. ప్రస్తుతం నగరంలో ఏడు గ్రామాలు విలీనం కావడంతో జనాభా, విస్తీర్ణం తదితర  అంశాల్లోనూ నగరం మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో త్వరలో జరగనున్న నగరపాలక  సంస్థ ఎన్నికలు సర్వత్ర చర్చనీయాశంగా మారాయి. ఎన్నికల అనంతరం కొలువుదీరే పాలకవర్గంపై అందరి దృష్టి నెలకుని ఉంది. అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతుందా లేదా ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్టు ఉంటుందా అన్నది వేచి చూడాలి.


ఏలూరు మునిసిపాలిటీగా ఏర్పడి శతాబ్దన్నర కాలం అయింది. 2005వ సంవత్సరంలో నగరపాలక సంస్థగా ఆవిర్భవించింది. అయినప్పటికీ అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉంది. ముఖ్యంగా డ్రెయినేజీ వ్యవస్థ, తాగునీరు, అంతర్గత రోడ్లు, ట్రాఫిక్‌ సమస్య తదితర అంశాలు ఇప్పటికీ ప్రధాన సమస్యలుగానే ఉన్నాయి. నగరానికి ఆనుకుని ఉన్న ఏడు పంచాయతీలు నగరంలో విలీనం అయితే అభివృద్ధి చెందుతుందని అంతా భావించారు. ఈక్రమంలో 2020 జనవరి 7వ తేదీన చుట్టుపక్కల ఉన్న ఏడు గ్రామాలను విలీనం చేస్తూ ప్రభుత్వం 240 జీవోను జారీ చేసింది. సత్రంపాడు, శనివారపు పేట, తంగెళ్ల మూడి, వెంకటాపురం, కొమడవోలు, పో ణంగి, చొదిమెళ్ల గ్రా మాలు విలీనం అయ్యాయి. ఈ విలీనంతో జనాభా పెరగడంతో పాటు విస్తీర్ణం గణ నీయంగా పెరిగింది. ఈ విలీన గ్రామాల ను నగరంలో ఉన్న 50 డివిజన్లలో సర్దు బాటు చేశారు. అనంతరం పురపాలక ఎన్నికల నోటిఫికేష న్‌ వచ్చింది. దీంతో ఏడు గ్రామాలు కలిపి జనాభా సేకరణ, రిజర్వేషన్ల జాబితాలను తయారు చేశారు. ఎన్నికలకు నామి నేష న్లు వేసిన అనంతరం ఉపసంహరణ దశ లో 2020 మార్చి 15వ తేదీన కరోనా వైరస్‌ కారణంగా ఎన్నికల కమిషన్‌ ఎ న్నికలను నిలుపుదల చేసిన నేపథ్యంలో మళ్లీ వచ్చే నెల 10వ తేదీన ఎన్ని కలు నిర్వహించనున్నట్టు  ఎన్నికల కమిషన్‌ రీ నోటిఫికేషన్‌ ఇచ్చింది. రాబో యే పాలకమండలి విలీన గ్రామాలతో కలిపిన నగరాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్తుందని ప్రజలు భావిస్తున్నారు. విలీన గ్రామాలు నగరంలో కల వక ముందు 2011 జనాభా లెక్కల ప్రకారం నగర జనాభా 2,17,896గా ఉంది. విస్తీర్ణం 11.52 చదరపు కిలోమీటర్లుగా ఉంది. విలీనం తర్వాత 2,71, 519 జనాభా, విస్తీర్ణం 62.09 చదరపు కిలోమీటర్లు అయింది. అయితే 2021 వరకు ఈ పదేళ్లలో జనాభా విలీన గ్రామాలతో కలుపుకుని మూడు లక్షలకు పైగా ఉంటుంది. విలీన గ్రామాలతో విస్తీర్ణం 50.57 చదరపు కిలోమీటర్లు పెరిగినందున నగరం అభివృద్ధి చెందేందుకు విస్తృత అవకాశాలున్నాయి. రాబోయే పాలక మండలి నగరాన్ని ఎలా అభివృద్ధి చేస్తుందో వేచి చూడాలి. 


2011 జనాభా లెక్కల ప్రకారం..


పంచాయతీ      జనాభా     విస్తీర్ణం చ.కిలోమీటర్లు

శనివారపుపేట         8,142 1.71

సత్రంపాడు         6,421 1.37

తంగెళ్ళమూడి         8,234 4.84

వెంకటాపురం         20,370 13.17

చొదిమెళ్ళ 4,567 7.37

కొమడవోలు     2,432 3.50

పోణంగి         3,477 18.61

ఏలూరు 2,17,876 11.52

 మొత్తం 2,71,519 62.09

Updated Date - 2021-02-27T05:33:48+05:30 IST