Abn logo
Sep 21 2021 @ 23:25PM

ఎడ్‌సెట్‌కు 906 మంది హాజరు

పరీక్షా కేంద్రం నుంచి వస్తున్న విద్యార్థులు

ఏలూరు ఎడ్యుకేషన్‌, సెప్టెంబరు 21 : బీఈడీ కళాశాలల్లో ప్రవేశాలకు మంగళవారం ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించిన ఎడ్‌సెట్‌కు ఏలూరు, భీమవరం కేంద్రాల్లో మొత్తం 906 మంది విద్యార్థులు హాజరయ్యారు. సీఆర్‌ఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాల పరీక్షా కేంద్రంలో 154, శ్రీవిద్యాలయ జూనియర్‌ కళాశాలలో 153, ఏలూరు ఇంజనీరింగ్‌ కళాశాలలో 126 మంది హాజరయ్యారని సీఆర్‌ఆర్‌ బీఈడీ కళాశాల డైరెక్టర్‌ డాక్టర్‌ డి.భాస్కరరావు తెలి పారు. భీమవరం ఇంజనీరింగ్‌ కళాశాలలో 112, డీఎన్‌ఆర్‌ కళాశాలలో 97, ఎస్‌ఆర్‌కెఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో 264 మంది హాజరయ్యారని నిర్వాహకులు తెలిపారు.