పక్కాగా ఈ–క్రాప్‌

ABN , First Publish Date - 2021-08-01T06:17:13+05:30 IST

పంటల నమోదులో ఈ– క్రాప్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తూ ఖరీఫ్‌ సీజన్‌కు సం బంధించి ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.

పక్కాగా ఈ–క్రాప్‌
యలమంచిలిలో ఈ–పంట నమోదు చేస్తున్న సిబ్బంది

 కొత్త మార్గదర్శకాలు విడుదల

 ఆధార్‌తో అనుసంధానం

ఇప్పటి వరకు 6,635 మంది ఈ–క్రాప్‌లో నమోదు

ఏలూరు సిటీ, జూలై 31 : పంటల నమోదులో ఈ– క్రాప్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తూ ఖరీఫ్‌ సీజన్‌కు సం బంధించి ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ క్రాప్‌ నమోదులో ఎదురవుతున్న సాంకే తిక ఇబ్బందులు, దీనివల్ల జరుగుతున్న జాప్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈకేవైసీ ప్రక్రియను సెప్టెంబరు/ అక్టోబరు నెలల్లో చేసే విధంగా, రైతుల ఆధార్‌ నెంబ రును మాత్రమే నమోదు చేసేలా మార్పులు చేశారు. అయితే సరైన ఆధార్‌ నెంబర్‌ను అప్‌లోడ్‌ చేసేందుకు అప్లికేషన్‌లో కొన్ని చెక్స్‌ పెట్టారు. దీనివల్ల ఆధార్‌ నెం బర్‌ను తప్పుగా నమోదు చేయడానికి ప్రయత్నించినా లేక ఒకే నెంబర్‌ను ఒకసారికన్నా ఎక్కువగా ఎంటర్‌ చేసే ప్రయత్నాలను ఈ అప్లికేషన్‌ అడ్డుకుంటోంది. జియో ఫెన్సింగ్‌ని ఆప్షనల్‌ చేశారు. అయితే ఈకేవైసీ, జియో ఫెన్సింగ్‌ కాప్చరింగ్‌ ప్రక్రియ పంటల కొనుగోలు కార్యక్రమాల ప్రారంభ సమయానికి ప్రణాళిక ప్రకారం డేటాని సిద్ధం చేయాలని నిర్ణయించారు. 

ఈ–క్రాప్‌ బుకింగ్‌ ఇలా...

ఆర్‌బీకేలలో బుధవారం నుంచే ఈ–క్రాప్‌ నమోదు వేగవంతమైంది.ఈ–క్రాప్‌ నమోదు ప్రక్రియలో భాగంగా రైతుల ఆధార్‌ కార్డు, పంట పొలానికి సంబంధించి 1–బి జిరాక్స్‌ కాపీలు తీసుకువచ్చి గ్రామ వ్యవసాయ సహాయకులచే పంట నమోదు చేసుకోవాలి. రైతులు రైతు భరోసా కేంద్రాలకు వచ్చి తాము పండించే పం టను నమోదు చేసుకోవాలి. రైతు ఎవరైతే వారు త ప్ప నిసరిగా రావాలి. భౌతికంగా, డిజిటల్‌ రశీదు ఉండాలి. దీనిపై రైతు సంతకం, వ్యవసాయ శాఖ సహా య కుని సంతకం ఉండాలి. పంట వేసిన ప్రతీచోటా ఈ– క్రాప్‌ బుకింగ్‌ చేయాలి. ఒక పొలంలో ఏ పంట వేశారు ? ఎవరు వేశారు? ఎన్ని ఎకరాలు వేశారు ? అనే విష యాలను నమోదు చేయాలి. పంటల బీమా చేయా లన్నా, సున్నా వడ్డీ రాయితీ ఇవ్వాలన్నా, పంటల కొను గోలు చేయాలన్నా.. ఇలా అన్ని అంశాల్లోనూ ఈ–క్రాప్‌ కీలకంగా మారుతోంది. ఈ–క్రాప్‌ బుకింగ్‌లో భాగంగా నూతన మార్గదర్శకాల్లో కౌలు రైతులకు కొంత వెసులు బాటు కల్పించారు. వారు రిజిస్ట్రేష న్‌ సమయంలో ఎటువంటి డాక్యు మెంట్లు ఇవ్వకపోయినా ఆధార్‌ కార్డు తప్పనిసరిగా ఇవ్వాలి. జిల్లా లో 3.12 లక్షల మంది రైతులు ఉం డగా బుధవారానికి 6,635 మంది రైతులు మాత్రమే ఈ– క్రాప్‌ నమోదు చేసుకున్నారు.  

Updated Date - 2021-08-01T06:17:13+05:30 IST