కొత్త డీఎస్సీలో 1,884 పోస్టులు

ABN , First Publish Date - 2021-03-05T05:32:07+05:30 IST

ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి ఉద్దేశించిన డీఎస్సీ–2021 రిక్రూట్‌మెంట్‌కు జిల్లాలో 1884 పోస్టులు ఉన్నట్టు నిర్ధారించారు.

కొత్త డీఎస్సీలో 1,884  పోస్టులు

ఏలూరు ఎడ్యుకేషన్‌, మార్చి 4: ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి ఉద్దేశించిన డీఎస్సీ–2021 రిక్రూట్‌మెంట్‌కు జిల్లాలో 1884 పోస్టులు ఉన్నట్టు నిర్ధారించారు. ఈ మేరకు ప్రభుత్వానికి జిల్లా విద్యాశాఖ నివేదికను పంపింది. జిల్లాలో మొత్తం 2073 ఉపాధ్యాయ ఖాళీలు ఉండగా, వీటిలో ఇన్‌ సర్వీస్‌ టీచర్లకు పదోన్నతి కోటా కింద 189 పోస్టులు మినహాయిస్తే 1884 పోస్టులు ఉంటున్నాయి. అయితే ఇందులో 345 సర్‌ప్లస్‌ (మిగులు) ఎస్జీటీ పోస్టులు కూడా ఉన్నాయి. వీటిని ప్రభుత్వం భర్తీ చేస్తుందా లేదా అన్నది తేలలేదు. ఇక డీఎస్సీ–2021 రిక్రూట్‌ మెంట్‌లో భర్తీ అయ్యే పోస్టుల్లో స్కూల్‌ అసిస్టెంట్‌ కేడర్‌ గణితం సబ్జెక్టులో మొత్తం ఖాళీలు 51 కాగా, ఇందులో ప్రమోషన్‌ కోటా 8 పోస్టులు పోను 43 పోస్టులకు డీఎస్సీ నియామకాలు చేపడతారు. ఫిజికల్‌ సైన్స్‌లో మొత్తం ఖాళీలు 22 కాగా, పదోన్నతి కోటా 7 పోస్టులు పోను 15 పోస్టులు భర్తీ చేస్తారు. బయో లాజికల్‌ సైన్స్‌లో మొత్తం ఖాళీలు 44 కాగా 14 పదోన్నతికి, 30 డైరెక్ట్‌ రిక్రూట్‌ మెంట్‌కు ప్రత్యేకిస్తారు. ఇంగ్లీషు సబ్జెక్టులో మొత్తం ఖాళీలు 25 కాగా, పదోన్నతికి 12 పోస్టులు ఉంచి మిగతా 13 పోస్టులకు నియామకాలు చేపడతారు. సోషల్‌లో మొత్తం ఖాళీలు 97 కాగా వీటిలో 57 పదోన్నతి కోటాకు ప్రత్యేకించి మిగతా 40 పోస్టులను డీఎస్సీలో భర్తీ చేస్తారు. తెలుగు సబ్జెక్టులో మొత్తం ఖాళీలు 66 కాగా, వీటిలో 13 పదోన్నతులకు, 53 డీఎస్సీకి ప్రత్యేకిస్తారు. హిందీ సబ్జెక్టులో మొత్తం ఖాళీలు 32 కాగా, 12 పోస్టులు పదోన్నతులకు, 20 పోస్టులకు డీఎస్సీ నియామ కాలకు చేపడతారు. ఫిజికల్‌ డైరెక్టర్‌లో మొత్తం ఖాళీలు 76 కాగా 66 పదోన్నతి కోటాకు, మిగతా 10 పోస్టులు డీఎస్సీకి ప్రత్యేకిస్తారు. 

Updated Date - 2021-03-05T05:32:07+05:30 IST