Advertisement
Advertisement
Abn logo
Advertisement

త్వరితగతిన సమస్య పరిష్కారానికి చర్యలు : డీఐజీ

ఏలూరు క్రైం, అక్టోబరు 22 : సర్వీసు రూల్స్‌ ప్రకా రం శాఖా పరంగా పూర్తి స్థాయిలో విచారణ చేసి త్వరితగతిన సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుం టామని ఏలూరు రేంజ్‌ డీఐజీ కేవీ మోహనరావు స్పష్టం చేశారు. పోలీస్‌ సిబ్బంది, మినిస్టీరియల్‌ స్టాఫ్‌ సమస్యల పరిష్కారానికి శుక్రవారం సంక్షేమ దివాస్‌ కార్యక్రమాన్ని ఏలూరులోని డీఐజీ కార్యాలయంలో నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్ర వరం అర్బన్‌,  పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో పని చేస్తున్న పోలీస్‌ సిబ్బంది, మహిళా పోలీసులు, మిని స్టీరియల్‌ సిబ్బంది తమ సమస్యలపై వినతులను డీఐజీకి అందజేశారు. వీరిలో ఎక్కువగా ప్రమోషన్లు, పనిష్మెంట్లపై వినతులు ఇవ్వగా, సర్వీసు రూల్స్‌ ప్రకారం పరిశీలించి చర్యలు తీసుకుంటామని డీఐజీ వెల్లడించారు. 

  పోలీసు సిబ్బంది సమస్యలను పరి ష్కరించేందుకు జిల్లా పోలీస్‌ కార్యా లయ సమావేశ మందిరంలో శుక్రవారం ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ ఆదేశాల మేరకు సంక్షేమ దివాస్‌ కార్యక్రమాన్ని నిర్వహిం చారు. అదనపు ఎస్పీ ఏవీ సుబ్బరాజు సిబ్బంది సమస్యలను తెలుసుకున్నారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన పోలీ సు సిబ్బంది, మినిస్టీరియల్‌ స్టాఫ్‌ సమ స్యలపై వినతిపత్రాలు ఇచ్చారు. అనం తరం వీడియో కాన్ఫరెన్సు ద్వారా జిల్లా లోని 61 పోలీసు స్టేషన్‌లలో పనిచేస్తున్న పోలీసు సిబ్బంది సమస్యలను తెలు సుకున్నారు. జిల్లా పోలీసు సంక్షేమ నోడల్‌ అధికారి ఎం.రాజా, ఏఆర్‌ ఆర్‌ఐలు మనోహర్‌, కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.  

Advertisement
Advertisement