ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించాలి : డీఐజీ

ABN , First Publish Date - 2021-04-13T05:13:28+05:30 IST

కరోనా మహమ్మారిని అదుపులో ఉంచా లంటే ప్రజలు ప్రతి ఒక్కరు మాస్క్‌లను ధరించాలని ఏలూరు రేంజ్‌ డీఐజీ కేవీ మోహనరావు అన్నారు.

ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించాలి : డీఐజీ
ర్యాలీలో పాల్గొన్న డీఐజీ మోహనరావు, ఎస్పీ నారాయణ నాయక్‌, పోలీసు సిబ్బంది

ఏలూరు క్రైం, ఏప్రిల్‌ 12 : కరోనా మహమ్మారిని అదుపులో ఉంచా లంటే ప్రజలు ప్రతి ఒక్కరు మాస్క్‌లను ధరించాలని ఏలూరు రేంజ్‌ డీఐజీ కేవీ మోహనరావు అన్నారు. ఏలూరులో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన ర్యాలీని సోమవారం చేపట్టారు.  ర్యాలీని డీఐజీ ప్రారంభించి మాట్లాడుతూ కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించడానికి పోలీస్‌ శాఖ ర్యాలీలు నిర్వ హిస్తోందన్నారు. ఎస్పీ కె.నారాయణ నాయక్‌ మాట్లాడుతూ వ్యాపారులు ఎవరైనా మాస్క్‌ ధరించకుండా వ్యాపారాలు కొనసాగించినా, మాస్క్‌ లేకుండా ఎవరినైనా అనుమతించినా వ్యాపారులపై ప్రజా ఆరోగ్యా నికి భంగం కలిగించారనే అభియోగంపై కేసులు నమోదు చేస్తామన్నారు. మాస్క్‌లు లేని వారికి మాస్క్‌లను పంపిణీ చేశారు. అదనపు ఎస్పీ ఏవీ సుబ్బరాజు, ఎస్‌ఈబీ అదనపు ఎస్పీ జయరామరాజు, ఏఆర్‌ అదనపు ఎస్పీ ఎం మహేష్‌కుమార్‌, ఏలూరు డీఎస్పీ డాక్టర్‌ దిలీప్‌ కిరణ్‌, డీటీసీ డీఎస్పీ కె.ప్రభాకరరావు, సీసీఎస్‌ డీఎస్పీ పైడేశ్వరరావు, దిశ పోలీస్‌ స్టేషన్‌ డీఎస్పీ కేవీ సత్యనారాయణ, ఎస్సీ, ఎస్టీ సెల్‌ డీఎస్పీలు ఎ.శ్రీనివాసరావు, ఎం. సుభాకర్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ సీఐ కొండలరావు, ఏఆర్‌ డీఎస్పీ కృష్ణంరాజు, సీఐలు, రెడ్‌ క్రాస్‌ చైర్మన్‌ మామిళ్ళపల్లి జయప్రకాష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-04-13T05:13:28+05:30 IST