బాబోయ్‌..ఇక్కడ పని చేయలేం..

ABN , First Publish Date - 2022-08-12T05:37:58+05:30 IST

నరసాపురం పురపాలక సంఘం పేరు చెప్పి తే.. ఇంజనీరింగ్‌ విభాగం హడలెత్తి పోతోంది.

బాబోయ్‌..ఇక్కడ పని చేయలేం..
నరసాపురం మునిసిపాలిటీ కార్యాలయం

మూడేళ్లలో నరసాపురం మునిసిపాలిటీలో నలుగురు డీఈలు బదిలీ
వృత్తిపర, రాజకీయ ఒత్తిళ్లే కారణమంటూ గుసగుసలు

నరసాపురం, ఆగస్టు 11 : నరసాపురం పురపాలక సంఘం పేరు చెప్పి తే.. ఇంజనీరింగ్‌ విభాగం హడలెత్తి పోతోంది. ఇక్కడికి బదిలీపై వచ్చేందుకు అధికారులు ఎవరూ మక్కువ చూపడం లేదు. వచ్చిన వారు  ఏడాది తిరగకుండానే బదిలీపై వెళ్లిపోతున్నారు. ఇలా మూడేళ్ల కాలంలో నలుగురు డీఈలు వెళ్లిపోవడమే దీనికి నిదర్శనం. మూడేళ్ల క్రితం ఇక్కడ డీఈగా లక్ష్మీనారాయణ ఉండేవారు. ఆయన వైసీపీ అధికారంలోకి రాగానే బదిలీపై వెళ్లిపోయారు. ఆయన స్థానంలో సూర్యప్రకాశరావు వచ్చారు. ఆయన కూడా ఆరునెలలు తిరగకుండానే బదిలీ చేయించుకున్నారు. తిరిగి శ్రీనివాస ప్రసాద్‌ వచ్చారు. ఈయన కూడా ఆరు నెలల్లోనే వెళ్లిపోయారు. దీంతో పాలకొల్లు డీఈగా పని చేస్తున్న విజయకుమార్‌ను డిప్యూటేషన్‌పై ఇక్కడికి తీసుకొ చ్చారు. అయితే ఆయన బదిలీలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఏడాదిగా ఆయనకు జీతం అందడం లేదు. దీంతో ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయిం చారు. ఇక్కడ పని చేస్తే జీతం రాదన్న ఉద్దేశంతో టీపీగూడెం బదిలీ చేయిం చుకున్నారు. ఆయన స్థానంలో అక్కడ పని చేస్తున్న సునీల్‌కుమార్‌ను నర సాపురం బదిలీ చేయగా ఇంతవరకు విధుల్లో చేరలేదు. ఇక్కడికి వచ్చేం దుకు సునీల్‌కుమార్‌ మక్కువ చూపడం లేదని సమాచారం. దీంతో డీఈ పోస్టు రెండు నెలల నుంచి ఖాళీగా ఉంది. ఇటు అధికారుల బదిలీలపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. పురపాలక సంఘంలో జనరల్‌ ఫండ్‌ నిధులు పూర్తిగా ఖాళీ అయ్యాయి. చేసిన పనులకు రూ.కోటి పైనే చెల్లించాల్సి ఉంది. ఈనేపథ్యంలో టెండర్లు పిలిచినా పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందు కు రావడం లేదు. అయితే ప్రజాప్రతినిధులు ,అ ధికారులు కాంట్రాక్టర్ల చేత పనులు చేయించాలని ఇంజనీరింగ్‌ విభాగంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. దీన్ని తట్టుకోలేకే బదిలీపై వెళ్లిపోతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఇక్కడ రాజకీయ ఒత్తిళ్లు ఎక్కువ అయ్యాయన్న వాదనలు లేకపోలేదు. దీనిపై పురపాలక అధికారులు మాత్రం నోరు మెదపకపోవడం గమనార్హం .

Updated Date - 2022-08-12T05:37:58+05:30 IST