మార్కెట్‌లోకి ఖర్జూరం

ABN , First Publish Date - 2021-04-16T05:04:54+05:30 IST

రంజాన్‌ అనగానే గుర్తుకు వచ్చేది ఖర్జూరం. ముస్లింలు పవిత్రంగా భావించే రంజాన్‌ మాసంలో ఈ పండు తినని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు.

మార్కెట్‌లోకి ఖర్జూరం

రంజాన్‌ మాసమంతా డిమాండ్‌

గణపవరం, ఏప్రిల్‌ 15: రంజాన్‌ అనగానే గుర్తుకు వచ్చేది ఖర్జూరం. ముస్లింలు పవిత్రంగా భావించే రంజాన్‌ మాసంలో ఈ పండు తినని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. నిరంతరం ఉపవాస దీక్షలు పాటించే ముస్లింలు ఖర్జూరం పండుతోనే దీక్ష విరమణ చేస్తారు. అలాంటి ఈ పండ్లకు గణపవరం మార్కెట్‌లో విస్తృతంగా లభిస్తున్నాయి. రంజాన్‌ ప్రారంభానికి  వారం రోజుల ముందే ఖర్జూరం పండ్ల నిల్వలు చేశారు. విదేశాల నుంచి దిగుమతి అవుతున్న ఈ పండ్ల వ్యాపారం ఈ నెల రోజుల పాటు లక్షల్లోనే సాగుతుదంటే ఈ పండ్లకు ఉన్న డిమాండ్‌ అర్థం చేసుకోవచ్చు. అరబ్‌ దేశాల నుంచి హైదరాబాద్‌, విజయవాడ మార్కెట్‌లోని వ్యాపారులు దిగుమతి చేసుకుంటున్నారు. అక్కడి నుంచి ఖర్జూరం పండ్లు ప్రస్తుతం గణపవరం మార్కెట్‌తో పాటు జిల్లాలోని పలు మార్కె ట్స్‌లో కూడా అందుబాటులో ఉన్నాయి. గత ఏడాది కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఖర్జూరం విక్రయాలు మందగించాయి. ఈ ఏడాది ఖర్జూర పండ్ల వ్యాపారం సాగుతుందని అనుకున్న తరుణంలో మరొకసారి కరోనా రెండవ దశ పంజా విసురుతుండడంతో ఒకింత ఆందోళనకు వ్యాపా రులు గురవుతున్నారు. మునుపటిలా ప్రస్తుతం కిలో ఖర్జూరం రూ.90 – 400 వరకు విలువ చేసే రకాలు మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి.  


Updated Date - 2021-04-16T05:04:54+05:30 IST