ఎయిడెడ్‌గానే సీఆర్‌ఆర్‌ను కొనసాగించాలి

ABN , First Publish Date - 2021-11-27T05:10:03+05:30 IST

ప్రభుత్వానికి సరెండర్‌ చేసిన అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందిని వెనక్కి రప్పించడంతో పాటు, సీఆర్‌ఆర్‌ డిగ్రీ కళాశా లను ఎయిడెడ్‌గానే కొనసాగిస్తామని సీఆర్‌ఆర్‌ విద్యా సంస్థల యాజమాన్యం ఇటీవల బహిరంగంగా ఇచ్చిన హామీ మేరకు అధికారిక లేఖను ఉన్నతాధికా రులకు అందజేయాలని డిమాండ్‌ చేస్తూ పీడీఎస్‌యూ నాయకులు, విద్యార్థులు శుక్రవారం సీఆర్‌ఆర్‌ పరిపాలన భవనం వద్ద ధర్నా నిర్వహించారు.

ఎయిడెడ్‌గానే సీఆర్‌ఆర్‌ను కొనసాగించాలి
ధర్నా చేస్తున్న విద్యార్థి సంఘ నాయకులు

యాజమాన్యం ఇచ్చిన హామీ మేరకుఅధికారిక లేఖను ఉన్నతాధికారులకు అందజేయాలి

పీడీఎస్‌యూ నాయకులు, విద్యార్థుల ధర్నా


ఏలూరు ఎడ్యుకేషన్‌, నవంబరు 26: ప్రభుత్వానికి సరెండర్‌ చేసిన అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందిని వెనక్కి రప్పించడంతో పాటు, సీఆర్‌ఆర్‌ డిగ్రీ కళాశా లను ఎయిడెడ్‌గానే కొనసాగిస్తామని సీఆర్‌ఆర్‌ విద్యా సంస్థల యాజమాన్యం ఇటీవల బహిరంగంగా ఇచ్చిన హామీ మేరకు అధికారిక లేఖను ఉన్నతాధికా రులకు అందజేయాలని డిమాండ్‌ చేస్తూ పీడీఎస్‌యూ నాయకులు, విద్యార్థులు శుక్రవారం  సీఆర్‌ఆర్‌ పరిపాలన భవనం వద్ద ధర్నా నిర్వహించారు. సీఆర్‌ఆర్‌ విద్యా సంస్థల పాలకవర్గ కమిటీ (ఎంసీ) సమావేశం జరుగుతోందన్న సమాచా రంతో పీడీఎస్‌యూ నాయకులు అక్కడకు చేరుకున్నారు. యాజమాన్యంతో మాట్లాడేందుకు నలుగురు విద్యార్థి ప్రతినిధులను పోలీసులు అనుమతించారు. యాజమాన్యంతో జరిపిన చర్చల వివరాలను పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు కె.నాని మీడియాకు వివరించారు. సమ్మతి లేఖ ఉపసంహరణపై ఇంకా చర్చిం చాల్సి ఉందని, దీనికి గడువు చెప్పలేమని యాజమాన్యం తెలిపిందన్నారు. సమ్మతి లేఖను ఉపసంహరించుకు నేంత వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామ ని ప్రకటించారు.


ఇంటర్‌ విద్యాధికారి కార్యాలయం వద్ద హైడ్రామా 

ఏలూరు అశోక్‌నగర్‌లోని ఎస్‌పీడీబీటీ జూనియర్‌ కళాశాలను ఎయిడెడ్‌గానే కొనసాగిస్తామని కళాశాల యాజమాన్యం కొద్ది రోజుల క్రితం పీడీఎస్‌యూ, ఏఐఎస్‌ఎఫ్‌ సంఘాల నాయకులు, విద్యార్థులకు హామీ ఇచ్చిన విషయం విదిత మే. ఆ మేరకు తొలుత అందచేసిన సమ్మతి లేఖను ఉపసంహరించుకుంటూ కళాశాల యాజమాన్యం జిల్లాలోని జూనియర్‌ కళాశాలలను పర్యవేక్షించే డీవీ ఈవో కార్యాలయంలో అధికారిక లేఖను అందచేసింది. ఇదే విషయాన్ని ధ్రువీక రించుకునేందుకు గురువారం డీవీఈవో కార్యాలయానికి పీడీఎస్‌యూ నాయకు లు వెళ్లి ఆరా తీయగా, యాజమాన్యం నుంచి ఎటువంటి ఉపసంహరణ లేఖ తమకు అందలేదని కార్యాలయ సిబ్బంది చెప్పడంతో అవాక్కయ్యారు. దీంతో కార్యాలయానికి రోజువారీ వచ్చే తపాలా, లేఖలను ఎంట్రీ చేసే రిజిష్టర్‌ను పీడీఎస్‌యూ నాయకులు పరిశీలించగా, ఉపసంహరణ లేఖ అందినట్టుగా నమోదై ఉంది. దీంతో అప్పటి కప్పుడు బయటకు తీసిన లేఖను రాజమహేంద్ర వరంలోని ఇంటర్‌ బోర్డు ఆర్జేడీ కార్యాలయానికి, అక్కడి నుంచి కమిషనర్‌ కార్యాలయానికి ఫార్‌వర్డ్‌ చేయించినట్టు సంఘ అధ్యక్షుడు నాని, రంగనాయ కులు వివరించారు.

Updated Date - 2021-11-27T05:10:03+05:30 IST